ఆ పార్టీలది ఫ్రస్ట్రేషన్: ప్రధాని చురక | Sakshi
Sakshi News home page

వాళ్ల నంబర్లు మరింత పడిపోవడం ఖాయం: మోదీ

Published Tue, Dec 19 2023 11:58 AM

Pm Modi Reacts On Opposition Parties Parliament Ruckus - Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్షాలు నిరాశ నిస్పృహలోకి వెళ్లాయని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ఈ నిస్పృహతోనే ఆ పార్టీలు పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నాయన్నారు. మంగళవారం(డిసెంబర్‌19)ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో మోదీ ప్రతిపక్షాలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రతిపక్ష పార్టీల ఈ తరహా ప్రవర్తన వల్ల రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో వాళ్ల నంబర్లు మరింత దిగజారుతాయని,బీజేపీ మరిన్ని సీట్లు గెలుచుకుంటుందన్నారు. కాగా, పార్లమెంట్‌ భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఈ డిమాండ్‌తోనే  ఆపార్టీలు పార్లమెంట్‌ సెషన్‌ను అడ్డుకుంటుండడంతో సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోపక్క పార్లమెంట్‌లో కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం యోచిస్తోంది.   

ఇదీచదవండి..గెలవాలనుకుంటే నితీశ్‌, నిశ్చయం.. రెండూ కావాలని పోస్టర్లు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement