సాక్షి, ఢిల్లీ: సైబర్ సెక్యూరిటీ కోసం కేంద్రం తీసుకువచ్చిన సంచార్ సాథీ యాప్‌పై విపక్షాలు భగ్గుమన్నాయి. ఇది పౌరుల గోప్యతకు భంగం కలిగించడమేనని విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
మరోవైపు.. అన్ని ఫోన్లలో తప్పనిసరిగా సంచార్ సాథీ యాప్ ఇన్ స్టాల్ చేయాలని ఫోన్ తయారీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. సైబర్ నేరాలను నిరోధించేందుకు పౌరుల భద్రత కోసం సంచార్ సాథీ అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా దీనిపై ప్రతిపక్షాలు వ్యతిరేకించడం గమనార్హం.


