రామేశ్వరం కేఫ్‌ పేలుడు.. పలు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ దాడులు | Nia Raids In Multi States Relating To Rameshwaram Cafe Blast | Sakshi
Sakshi News home page

రామేశ్వరం కేఫ్‌ పేలుడు.. పలు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ దాడులు

May 21 2024 9:45 PM | Updated on May 21 2024 9:45 PM

Nia Raids In Multi States Relating To Rameshwaram Cafe Blast

బెంగళూరు: సంచలనం రేపిన రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో మంగళవారం(మే21) ఎన్‌ఐఏ పలు రాష్ట్రాల్లో ఏక కాలంలో  దాడులు నిర్వహించింది. కేసులో కొందరు అనుమానితులకు సంబంధించి అందిన సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించినట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.

రాత్రి వరకు దాడులు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ కేసులో విచారణను ఎన్‌ఐఏ మార్చి3వ తేదీన ప్రారంభించింది. ఏప్రిల్‌ 12న పేలుడు ప్రధాన సూత్రధారి అబ్దుల్‌ మతీన్‌ అహ్మద్‌, బాంబు పెట్టిన వ్యక్తిగా భావిస్తున్న ముస్సావిర్‌ హుస్సేన్‌ షాజిబ్‌ను కోల్‌కతాలో అరెస్టు చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement