న్యూఢిల్లీ: నవరాత్రులు, దీపావళి సందర్భంగా వైష్ణోదేవి ఆలయ దర్శనానికి జమ్ము, కట్రా వెళ్లే భక్తుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో ఉత్తర రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. న్యూఢిల్లీ- మాతా వైష్ణోదేవి కట్రా స్పెషల్ ట్రైన్ సర్వీసులను పెంచడంతో పాటు జమ్మూ తవి-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అదనపు కోచ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
కట్రా స్పెషల్‌కు 14 ట్రిప్పులు
వివరాల ప్రకారం.. 04081 నంబర్ గల న్యూఢిల్లీ-శ్రీమాత వైష్ణోదేవి కట్రా స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 12 నుంచి 25 వరకు మొత్తం 14 ట్రిప్పులు నడవనుంది. తిరుగు ప్రయాణంలో 04082 నంబర్ గల శ్రీమాత వైష్ణోదేవి కట్రా-న్యూఢిల్లీ స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 13 నుంచి 26 వరకు 14 ట్రిప్పులు నడుస్తుంది.
ఈ స్టేషన్లలో ఆగుతుంది
ఈ స్పెషల్ ట్రైన్ మార్గమధ్యంలో పానిపట్, కురుక్షేత్ర, అంబాలా కాంట్, లూధియానా, జలంధర్ కాంట్, పఠాన్‌కోట్ కాంట్, జమ్మూ తవి, షహీద్ కెప్టెన్ తుషార్ మహాజన్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అదనపు కోచ్‌లు
పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జమ్ము తావి-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అదనపు కోచ్‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో జమ్మూ, కట్రా వెళ్లే ప్రయాణికులకు అదనపు సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
రద్దీ తగ్గే అవకాశం
స్పెషల్ ట్రైన్‌కు అదనపు ట్రిప్పులు, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అదనపు కోచ్‌ల ఏర్పాటు వల్ల న్యూఢిల్లీ, జమ్ము, కట్రా మధ్య ప్రయాణించే వారికి కొంత ఊరట లభించనుంది. సాధారణ రైళ్లపై ప్రయాణికుల రద్దీ ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఆటోవాలా లైఫ్‌లో.. సంపాదన మూరెడు.. చదువు ఖర్చు బారెడు!


