
ఆదంపూర్: భారత్ మాతాకీ జై.. ఇది దేశ ప్రజల నినాదం అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. యుద్ధ రంగంలో సైనికులు భారత్ మాతాకీ జై అంటే.. శత్రువు వెన్నులో వణుకు పుట్టడం ఖాయమన్నారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సిందూర్ తరువాత మంగళవారం ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' పంజాబ్‌లోని అదంపూర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లారు. అక్కడ వాయుసేన సేవలను ఉద్దేశించి ప్రసంగించారు.
పాకిస్తాన్కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తన సత్తా చూపించిందని అన్నారు. భారత్ మాతాకీ జై.. ఇది దేశ ప్రజల నినాదం అని అన్నారు. యుద్ధ రంగంలో మన సైనికులు చరిత్ర సృష్టించారని అన్నారు. ఆపరేషన్ సిందూర్ అనేది ప్రపంచమంతా మార్మోగిందని, ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన విధానమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
నా జీవితం ధన్యమైంది
‘దేశ ప్రజలంతా సైన్యానికి అండగా నిలబడ్డారు. భారత్ శక్తి సామర్థ్యాలు చూసి నా జీవితం ధన్యమైంది. మన సైన్యం సామర్థ్యం భావి తరాలకు స్ఫూర్తిదాయకం. వీర సైనికులందరికీ నా సెల్యూట్. ఆపరేషన్ సిందూర్ నినాదం ప్రపంచమంతా మారుమ్రోగింది. సైన్యం దేశ ఆత్మ విశ్వాసం పెంచింది. ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన సిద్ధాంతం. అక్క చెల్లెల సిందూరం తుడిచినవారిని నాశనం చేశాం’ అని మోదీ సైన్యాన్ని కొనియాడారు.

‘గురిచూసి కొట్టిన దెబ్బతో.. శత్రు స్థావరాలు మట్టిలో కలిశాయి. వారు వెనుక నుంచి దాడి చేస్తే.. మీరు ముందు నిలబడి ధైర్యంగా దాడిచేశారు. పాకిస్తాన్ డ్రోన్స్, యూవీఏలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు మన రక్షణ వ్యవస్థ ముందు నిలబడలేకపోయాయి. పాక్ శత్రువులు పౌరులను అడ్డుపెట్టుకుని దాడులకు పాల్పడింది. కానీ మీరు మాత్రం పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా శత్రువును దెబ్బకొట్టారు. అణు బ్లాక్ మెయిల్‌ను భారత్ ఎప్పటికీ సహించదు. మళ్ళీ ఉగ్రదాడి జరిగితే.. భారత్ కచ్చితంగా సమాధానం ఇస్తుంది. ప్రతి కుటుంబం మీకు రుణపడి ఉంటుంది’ అని మోదీ పేర్కొన్నారు.
#WATCH | At the Adampur Air Base, PM Narendra Modi said, "Besides manpower, the coordination of machine in #OperationSindoor was also fantastic. Be it India's traditional air defence system which has witnessed several battles or our Made in India platforms like Akash - all of… pic.twitter.com/Y2dYnanFmN
— ANI (@ANI) May 13, 2025