ముంబై మేయర్ రీతూ తావ్డేకు ఊహించని అనుభవం ఎదురైంది. ముంబైవ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించడానికి ఆమె నగర వీధులలో పర్యటించారు. అయితే అనూహ్యంగా ఆమె కళ్లెదుటే ఓ వ్యక్తి మ్యాన్‌హోల్‌లో పడిపోయారు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది ఆయనను రక్షించారు. ఇది చూసిన మేయర్ తీవ్ర అసహానంతో ఆగ్రహం చెందారు.
నిన్న(మంగళవారం) ముంబైలో విపరీతంగా వర్షం కురిసింది. రాత్రంతా కురిసిన కుండపోత వర్షాల వల్ల నగరంలో రోడ్లు జలమయమవడమే కాకుండా, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల గోడలు కూలిపోవడం వంటి నష్టాలు కూడా జరిగాయి. దీంతో పరిస్థితులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడానికి మేయర్ నగరంలో పర్యటించారు.
బుధవారం ఉదయాన్నే దాదర్, హింద్‌మాతా, గాంధీ మార్కెట్ వంటి ప్రభావిత ప్రాంతాలకి వెళ్లారు. ఈ తనిఖీల సమయంలో ఒక పారిశుధ్య కార్మికుడు అక్కడే డ్రైనేజ్ తెరిచి ఉండడంతో అందులో పడిపోయాడు. అయితే ఈ సమయంలో అక్కడే ఉన్న మేయర్ ఈ ఘటనపై స్పందించారు. సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని, సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
అయితే ఈ ఘటన అనంతరం మేయర్ మీడియాతో మాట్లాడారు. భారీవర్షాల కారణంగా పేరుకపోయిన వ్యర్థాలను తొలగించడం కోసమే ఆ మ్యాన్‌హోల్ పారిశుద్ధ్య కార్మికులు పక్కకు జరిపారని వివరించారు. ఆ సమయంలో అక్కడ అక్కడ ఏర్పాటు చేసిన 'అలర్ట్' (హెచ్చరిక) బోర్డులను, బారికేడ్లను ప్రజల గమనించాలని సూచించారు.
అయితే ముంబై వర్షాలపై ప్రతిపక్ష శివసేన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఆదిత్య థాకరే, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం బీఎంసీ నిధులను పూర్తిగా ఖాళీ చేసిందని ఆరోపించారు. గతంలో థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం సూచించినట్లుగా రెయిన్ వాటర్ ట్యాంకులను నిర్మించడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలకు మేయర్ కౌంటరిచ్చారు. "ఇంట్లో కూర్చుంటే పనులు కావు, క్షేత్రస్థాయిలోకి రావాలి" అంటూ ఎద్దేవా చేశారు. కోవిడ్ సమయంలో ఆధిత్య థాకరే ఇంట్లోనే కూర్చుని పాలన సాగించారని ఆరోపించిన మేయర్, ప్రతిపక్షాలు ముందుగా రోడ్లపైకి వచ్చి చూడాలని హితవు పలికారు.
पालिका कर्मचारी महापौर ऋतू तावडे यांच्यासमोर man hole मध्ये पडला…
आज मुंबईत मुसळधार पाऊस झाला त्याची पाहणी महापौर करत असताना सदर घटना घडली pic.twitter.com/gJMDQYptEd
— Seema Adhe (@AdheSeema) June 24, 2026


