5 రోజుల్లో రూ.26 వేల కోట్లు లాభపడిన లక్కీ ఇన్వెస్టర్లు

Mukesh Ambani Reliance Industries investors amassed Rs 26000 crore in 5 days - Sakshi

దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్) కూడా ఒకటి. ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌  మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంకాప్) పరంగా కూడా టాప్ 10 కంపెనీల జాబితాలో టాప్‌లో  కొనసాగుతూ వస్తుంది.  తాజాగా లిస్ట్‌లో కూడా  రిలయన్స్‌ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.  

రిలయన్స్ మార్కెట్ క్యాప్‌ గత వారం రూ.16,19,907.39 కోట్లకు పెరిగింది. దీంతో రిలయన్స్‌ పెట్టుబడిదారులు అపార లాభాలను సొంతం చేసుకున్నారు. గత  5 రోజుల ట్రేడింగ్‌లో రూ. 26,000 కోట్లకు పైగా లాభాలను సాధించారు. ఆర్‌ఐఎల్  ఎంక్యాప్‌  గత వారం రూ.16,19,907.39 కోట్లకు పెరిగింది. క్రితం వారంతో పోలిస్తే రూ.26,014.36 కోట్లు పెరిగింది. 

మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో  నాలుగు  కంపెనీలు గణనీయమైన  పెరుగుదలను నమోదు చేశాయి. ఇందులో ఆర్‌ఐఎల్‌ తరువాత  భారతీ ఎయిర్‌టెల్, ఐసిఐసిఐ బ్యాంక్ ,హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నిలిచింది. ఆరు  కంపెనీలు లాభాలనుకోల్పోయాయి.  రూ. 20,490 లాభాలతో రూ. 11,62,706.71 కోట్ల ఎంక్యాప్‌తో  హెచ్‌డీఎఫ్‌సీ రెండో స్థానంలో ఉంది. భారతీ ఎయిర్‌టెల్   మార్కెట్‌  క్యాప్‌  రూ. 5,46,720.84 కోట్లకు చేరుకుంది.  ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,030.88 కోట్లు పెరిగి రూ.6,51,285.29 కోట్లకు చేరుకుంది.

గత వారం నష్టపోయిన టాప్‌ కంపెనీల్లో టీసీఎస్‌ నిలిచింది. రూ.16,484.03 కోట్లు తగ్గి రూ.12,65,153.60 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ఎస్‌బీఐ , బజాజ్ ఫైనాన్స్ నష్టపోయిన ఇతర టాప్‌ కంపెనీలు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top