నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిర్భయమైన నాయకత్వానికి, అచంచలమైన దేశభక్తికి ప్రతీకగా నిలిచారని ప్రధాని మోదీ అన్నారు. జనవరి 23 నేతాజీ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేస్తూ ప్రధాని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్మృతులతో కూడిన ప్రత్యేక వీడియోను తన ఎక్స్ ఖాతాలో జోడించారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ "నేతాజీ జయంతిని మనం పరాక్రమ్ దివస్‌గా జరుపుకుంటున్నాం. ఈ సందర్బంగా ఆయన అజేయమైన సంకల్పాన్ని, దేశానికి చేసిన అసమానమైన సేవలను స్మరించుకుందాం. నిర్భయమైన నాయకత్వానికి అచంచలమైన దేశభక్తికి ఆయన ప్రతీకగా నిలిచారు. ఆయన ఆలోచనలు దేశాన్ని ధృడంగా నిలపడంలో ఎన్నో తరాలకు ఆదర్శంగా నిలుస్తాయి" అని మోదీ అన్నారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్‌లో జన్మించారు. పిన్న వయస్సులోనే ఐసీఎస్ ( ప్రస్తుత సివిల్స్) పరీక్షకు ఎంపికయ్యారు. అయినప్పటికీ తన దేశవాసులు పడుతున్న కష్టాలు చూసి ఆ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం 2021 నుంచి జనవరి 23ను పరాక్రమ్ దివస్‌గా జరుపుతుంది.
On the birth anniversary of Netaji Subhas Chandra Bose, which is commemorated as Parakram Diwas, we recall his indomitable courage, resolve and unparalleled contribution to the nation. He epitomised fearless leadership and unwavering patriotism. His ideals continue to inspire… pic.twitter.com/KokJhJu33d
— Narendra Modi (@narendramodi) January 23, 2026


