వ్యవస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తోంది: ఖర్గే | Modi Govt Systematically weakening democratic institutions | Sakshi
Sakshi News home page

వ్యవస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తోంది: ఖర్గే

Feb 5 2024 6:22 AM | Updated on Feb 5 2024 6:22 AM

Modi Govt Systematically weakening democratic institutions - Sakshi

త్రిస్సూర్‌: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను క్రమబద్ధంగా నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రతిపక్ష నేతలపై తప్పుడు, నిరాధార ఆరోపణలు చేసేందుకు ఈడీ, సీబీఐ, ఐటీ వంటి విభాగాలను ఆయుధాలుగా వాడుకుంటోందన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికలకు గాను ఆదివారం ఆయన కేరళ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

త్రిస్సూర్‌లోని తెక్కునాడు మైదాన్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన ‘మహాజన సభ’నుద్దేశించి మాట్లాడారు. సమావేశంలో 25వేలకు పైగా బూత్‌ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బ ణం విపరీతంగా పెరిగాయని, దేశంలో పేద, ధనిక అంతరాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయని, పేదలు మరింత పేదలుగా మారుతున్నారని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement