
రేవునగరిలో ప్రేమ రగడ
యశవంతపుర: మంగళూరులో మతాంతర పెళ్లి కలకలం రేపింది. హిందూ సంఘాల కార్యకర్తలు ఆందోళన చేశారు. వివరాలు.. మంగళూరుకు చెందిన విస్మయ అనే యువతి బీసీఎ పూర్తి చేసింది. పొరుగున కేరళకు చెందిన మహమ్మద్ అషా్వక్‌తో ఆమెకు పరిచయమై ప్రేమలో పడ్డారు. రెండు నెలల పరిచయంతోనే విస్మయను బ్రెయిన్‌వాష్ చేసి లవ్‌లో పడేశాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. జూన్ 6న ఉళ్లాల నుంచి విస్మయను అషా్వక్ తీసుకెళ్లగా తల్లిదండ్రులు ఉళ్లాల పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టారు.
పోలీసులు గాలించి విస్మయను తల్లిదండ్రులకు అప్పగించారు. మళ్లీ జూన్ 30న ఉళ్లాల నుంచి విస్మయను తీసుకెళ్లాడు. విస్మయను తీసుకొచ్చి కౌన్సెలింగ్ నిర్వహించినా ఫలితం లేదని తల్లిదండ్రులు వాపోయారు. కేరళలో మతమారి్పడి చేసి పెళ్లి చేసుకున్నాడని విస్మయ తండ్రి వినోద్ తెలిపారు.
తల్లిదండ్రులు, హిందూ సంఘాల నాయకులు విస్మయకు నచ్చజెప్పినా వినలేదు. మరోవైపు తన భార్యను కిడ్నాప్ చేసేందుకు యత్నించారంటూ భర్త కేరళలో హైకోర్టులో కేసు వేశాడు. ప్రస్తుతం ఆ జంట కేరళ కాసరగోడు విద్యానగరలో కాపురం పెట్టారు. తన కూతురిని కాపాడాలంటూ తండ్రి హిందూసంఘాల నేతలకు మొరపెట్టుకున్నారు.