బెంగళూరు: ‘నేను బాలికని, నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. సహాయం చేయండి’ అని బాలల సహాయ కేంద్రానికి ఫోన్ చేసిన ఒక బాలికను అధికారులు రక్షించారు. ఈ సంఘటన చామరాజనగర జిల్లా, గుండ్లుపేట తాలూకాలోని శివపుర గ్రామంలో జరిగింది. మలవల్లి గ్రామానికి చెందిన ఒక బాలికకు శివపుర గ్రామానికి చెందిన యువకునితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు.
ఆ బాలికను ఏడు రోజులుగా ఆ యువకుని ఫామ్‌హౌస్‌లో ఉంచారు. ఈ సమయంలో బాలిక బాలల సహాయ కేంద్రానికి ఫోన్ చేసి, ‘నేను మైనర్‌ని, ఇక్కడ నేను సమస్యలను ఎదుర్కొంటున్నాను‘ అని చెప్పింది. శివపుర గ్రామ పంచాయతీ పీడీఓ శిల్ప ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు స్థానిక అంగన్‌వాడీ కార్యకర్తలతో కలిసి ఫామ్‌హౌస్‌కు వెళ్లి బాలికను రక్షించారు. తల్లిదండ్రుల వద్ద ఉంచితే ప్రమాదమని శిశుగృహానికి తరలించినట్లు తెలిపారు.


