ఢిల్లీకి వాతావరణ శాఖ హెచ్చరికలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ | Meteorological Department Yellow Alert Delhi On Monday | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి వాతావరణ శాఖ హెచ్చరికలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ

Sep 2 2024 7:23 AM | Updated on Sep 2 2024 9:37 AM

Meteorological Department Yellow Alert Delhi On Monday

దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈ తరుణంలో సోమవారం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో రికార్డ్‌ స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రుతుపవనాల కారణంగా భారీ వర్ష పాతం నమోదు అయ్యే అవకాశం ఉందని భావించిన వాతావరణ శాఖ ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో గురువారం వరకు తేలికపాటి వర్షం, మరి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలిపింది.

ఢిల్లీలో ఆదివారం ఉదయం 8.30గంటల నుంచి సాయంత్రం 5.30వరకు వర్షం పడలేదు. దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలో రుతుపవనాల ద్రోణి కదిలి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాలపై మళ్లుతుందని వాతావరణ శాఖ అధికారుల అంచనా.  
 

Advertisement
 
Advertisement
Advertisement