నామినేషన్‌ వివాదం.. ఈసీని కలిసిన కాంగ్రెస్‌ నేతల బృందం | Meenakshi Rs Nomination Controversy: Top Congress Leaders Meet Ec | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ వివాదం.. ఈసీని కలిసిన కాంగ్రెస్‌ నేతల బృందం

Jun 10 2026 3:53 PM | Updated on Jun 10 2026 4:16 PM

Meenakshi Rs Nomination Controversy: Top Congress Leaders Meet Ec

ఢిల్లీ: మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణ వివాదం దుమారం రేపుతోంది.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కాంగ్రెస్‌ నేతల బృందం.. మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణ చట్టవిరుద్ధమని పేర్కొంది. తన విస్తృత అధికారాలతో నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఈసీని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. గతంలో హరియాణా, గుజరాత్‌లో ఆర్‌వో నిర్ణయాలు ఈసీ సరిచేసిందని కాంగ్రెస్‌ ఎంపీ, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్‌ మన్వు సంఘ్వీ అన్నారు.

కాగా, ఈ మొత్తం వివాదంపై ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. సాధారణంగా రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా.. చట్టపరమైన ప్రక్రియనే ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నామినేషన్ స్క్రూటినీ సమయంలో వచ్చిన అభ్యంతరాలు, సమర్పించిన అఫిడవిట్ వివరాల ఆధారంగానే రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకుంటారని గుర్తు చేస్తున్నారు.

కాంగ్రెస్‌ నిరసనలు చేస్తేనో.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తేనో ఈసీ నిర్ణయాలు మారవని.. దాని పరిధి కేవలం ఎన్నికల ప్రక్రియ నిర్వహణకే పరిమితమని, లీక్‌లు లేదంటే రాజకీయ ఆరోపణలపై స్పందించేది కాదని కూడా అంటున్నారు. దీంతో కాంగ్రెస్‌ ముందు కోర్టును ఆశ్రయించడమనే ఆప్షన్‌ మాత్రమే ఉందని చెబుతున్నారు.

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement