
న్యూఢిల్లీ: వరసబెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేతల జాబితాలో మణిశంకర్ అయ్యర్ చేరిపోయారు. దక్షిణభారత వాసులు ఆఫ్రికన్లలా ఉంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్యామ్ పిట్రోడా వివాదం ముగిసేలోపే అయ్యర్ పాత వీడియో ప్రస్తుతం బీజేపీ ఎన్నికల ప్రచారాస్త్రంగా మారిపోయింది. పాక్ పట్ల కాంగ్రెస్ పక్షపాత ధోరణి మరోసారి బట్టబయలైందని బీజేపీ దుమ్మెతిపోయగా అవి అయ్యర్ వ్యక్తిగత అభిప్రాయాలని, పారీ్టతో సంబంధం లేదని కాంగ్రెస్ ఖరాకండీగా చెప్పేసింది.
అయ్యర్ అన్నదేంటి?
ఏప్రిల్‌లో ‘చిల్‌పిల్ మణిశంకర్’ పేరిట జరిగిన ఒక ఇంటర్వ్యూలో అయ్యర్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ‘‘ పొరుగుదేశమైన పాకిస్తాన్‌కు మనం గౌరవం ఇవ్వాల్సిందే. ఎందుకంటే అది కూడా సార్వ¿ౌమ దేశమే. దాయాది దేశంతో తగాదాలకు పోతే భారత్‌పై అణుబాంబు వేయాలనే దుర్బుద్ధి పాక్ పాలకుల్లో ప్రబలుతుంది. పాక్‌తో కఠినంగా వ్యవహరించొచ్చు. కానీ చర్చలైతే జరపాలికదా. సరిహద్దుల్లో తుపాకీ పట్టుకుని తిరిగినంతమాత్రాన ఒరిగేదేమీ ఉండదు. ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతాయి. పాక్‌లో పిచ్చోడు అధికారంలోకి వస్తే భారత్‌కు ప్రమాదమే కదా. పాక్ వద్ద కూడా అణుబాంబులు ఉన్నాయి. మన అణుబాంబును లాహోర్‌లో పేలిస్తే తిరిగి దాని రేడియోధారి్మక ప్రభావం కేవలం ఎనిమిది సెకన్లలోనే మన అమృత్‌సర్‌పై పడుతుంది. అందుకే పాక్‌తో చర్చల ప్రక్రియ మొదలెట్టాలి’’ అని అన్నారు.