లాక్‌డౌన్‌ తప్ప మరో మార్గం లేదు.. రెండ్రోజుల్లో నిర్ణయం!

Maharashtra CM Uddhav Thackeray Hints At lockdown - Sakshi

అఖిల పక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే 

మరింత దారుణంగా మారే అవకాశముందని వ్యాఖ్య

సాక్షి ముంబై: మహారాష్ట్రలో లాక్‌ డౌన్‌ విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే పేర్కొన్నారు. కరోనాకు అడ్డుకట్ట వేయాలంటే లాక్‌డౌన్‌ మినహా మిగత ఎలాంటి ప్రత్యామ్నాయం లేదన్నారు. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇలాంటి నేపథ్యలో మినీ లాక్‌డౌన్, వీకెండ్‌ లాక్‌డౌన్‌ ప్రభావం అంతగా చూపడంలేదని తెలుస్తోంది. ముఖ్యంగా మినీ లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన అనంతరం కూడా రోజు రోజుకి కరోనా రోగుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య అయిదు లక్షలు దాటింది. ఈ  సంఖ్య ప్రపంచంలోనే ఏడవ స్థానంలో ఉండగా  మరోవైపు ప్రతి రోజు కరోనా రోగుల సంఖ్య 60 వేల చేరువలో నమోదవుతోంది. ఈ సంఖ్య ప్రపంచంలోనే మూడవ స్థానం, మరోవైపు మృతుల సంఖ్య పెరుగుతోంది. వీటన్నింటి దృష్ట్యా రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ విషయంపై ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే  శనివారం సాయంత్రం ఆన్‌లైన్‌లో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే, ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ ఇతర మహావికాస్‌ ఆఘాడి నేతలలతోపాటు ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర చీఫ్‌ సెక్రటరి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా రాష్ట్రంలోని కరోనా పరిస్థితి, లాక్‌డౌన్‌ అంశంపై చర్చలు జరిగాయి.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే మాట్లాడుతూ లాక్‌డౌన్‌ మినహా ఎలాంటి ప్రత్యామ్నయం లేదని  పేర్కొన్నారు. ముఖ్యంగా ఏప్రిల్‌ 15వ తేదీ తర్వాత ప రిస్థితి మరింత దారుణంగా మారే అవకాశాలున్నాయన్నారు. సెకండ్‌ వేవ్‌లో యువత కూడా పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ఇలాంటి నేపథ్యలో ప్రజల ప్రాణాలు ముఖ్యమని దీంతో కొంత కష్టమైన కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు  ముందుగా కనీసం ఎనిమిది రోజుల లాక్‌డౌన్‌ విధించి ఆ తర్వాత ఆంక్షలను కొంత శిథిలం చేస్తూ ఒక్కొ సేవలను ప్రారంభిస్తామంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.  లాక్‌డౌన్‌ విధించినట్టయితే నెల రోజుల్లో పరిస్థితిని నియంత్రణలోకి వచ్చేఅవకాశాలున్నాయన్నారు. అయితే నిపుణులు మాత్రం కరోనా గొలుసును తెంచేందుకు (కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు) కనీసం రెండు వారాల లాక్‌డౌన్‌ అమలు చేయాలని సూచించారు.  

ప్రజల్లో కోపోద్రిక్తతలు పెరుగుతాయి: దేవేంద్ర ఫడ్నవీస్‌ 
లాక్‌డౌన్‌ విధించడాన్ని ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫఢణవీస్‌ వ్యతిరేకించారు. దీంతో ప్రజల్లో కోపోద్రిక్తతలు పెరుగుతాయన్నారు.. కరోనా రోగుల సంఖ్య పెరుగుతుందని దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఆంక్షలు విధించాలి, కాని లాక్‌డౌన్‌ విధించడం సరికాదన్నారు. లాక్‌డౌన్‌ విధించినట్లయితే పేదలకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని ఆయన డిమాండు చేశారు.  

రెండు రోజుల్లో తుది నిర్ణయం..! 
లాక్‌డౌన్‌కు సంబంధించి రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా ఈ విషయంపై మరోసారి టాస్క్‌ఫోర్స్‌తోపాటు ఇతర అధికారులతో ఆదివారం ముఖ్యమంత్రి చర్చించనున్నారు. అదేవిదంగా లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు ముందస్తు ఏర్పాట్లతోపాటు మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉంది. దీంతో రెండు రోజుల్లో లాక్‌డౌన్‌కు సంబంధించి తుది నిర్ణయం ప్రకటిస్తారని తెలిసింది.

కరోనాతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మృతి 
ముంబై సెంట్రల్‌: నాందేడ్‌ జిల్లాలోని దెగలూర్‌–బిలోలి నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రావ్‌సాహెబ్‌ అంతాపూర్కర్‌(55) కరోనాతో మృతి చెందారు. బాంబే హాస్పిటల్‌లో కరోనాకు చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యాక నాందేడ్‌లోని ఆసుపత్రిలో చికిత్సనందించారు. కానీ, పరిస్థితి క్షీణించడంతో ముంబైలోని బాంబే ఆసుపత్రికి తరలించారు. చికిత్స జరుగుతుండగానే రావుసాహెబ్‌ ప్రాణం వదిలారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత మంత్రి అశోక్‌ చవాన్‌కు సన్నిహితుడు. కరోనాతో మహారాష్ట్రలో మృతి చెందిన ఎమ్మెల్యేలలో ఇతను రెండోవారు. ఇంతకు క్రితం పండర్‌పూర్‌ మంగళ్‌వేడా నియోజకవర్గానికి చెందిన రాష్ట్రవాది కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భారత్‌ భాల్కే కూడా కరోనా వ్యాధితోనే మరణించారు. ప్రస్తుతం ఆ నియోజక వర్గంలో ఉపఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఇంతలో మరో ఎమ్మెల్యే రావ్‌సాహెబ్‌ అంతాపూర్కర్‌ కూడా కరోనా బారిన పడి మృతి చెందడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

06-05-2021
May 06, 2021, 20:01 IST
హైదరాబాద్‌: కరోనా వైరస్‌ ఎన్‌440కే వేరియంట్‌పై సీసీఎంబీ క్లారిటీ ఇచ్చింది. ఇది కొత్త రకం వేరియంట్‌ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న...
06-05-2021
May 06, 2021, 19:46 IST
న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతుంది. రోజు ల‌క్ష‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. కోవిడ్ క‌ట్ట‌డి కోసం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ...
06-05-2021
May 06, 2021, 19:09 IST
బాలీవుడ్‌ నటి  శ్రీపద  కరోనాతో కన్ను మూశారు. సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్  ట్విటర్‌ ద్వారా  శ్రీపద మరణంపై...
06-05-2021
May 06, 2021, 18:53 IST
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,10,147 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 21,954  కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది....
06-05-2021
May 06, 2021, 18:34 IST
కరోనా  నివారణకు సంబంధిం సింగిల్‌ డోస్‌ స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను  ఆమోదించినట్టు వెల్లడించింది.  స్పుత్నిక్  ఫ్యామిలీకే చెందిన ఈ సింగిల్-డోస్ ‘స్పుత్నిక్ లైట్’ విప్లవాత్మకమైందని, 80 శాతం...
06-05-2021
May 06, 2021, 17:25 IST
ఢిల్లీ: భారత్‌లో క‌రోనా వైర‌స్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గురువారం రాష్ట్రాలు, జిల్లాల వారీగా...
06-05-2021
May 06, 2021, 17:14 IST
సాక్షి, అమరావతి : ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో కోవిడ్‌ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలని, ఎంప్యానెల్‌ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50...
06-05-2021
May 06, 2021, 17:12 IST
న్యూఢిల్లీ: దేశ‌రాజ‌ధానిలో ఆక్సిజ‌న్ కొర‌త‌పై సుప్రీంకోర్టు కేంద్రంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీకి ప్ర‌తిరోజు 700 మెట్రిక్...
06-05-2021
May 06, 2021, 16:30 IST
ఢిల్లీ: కరోనా థర్డ్‌వేవ్‌ హెచ్చరికలపై సుప్రీంకోర్టు గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. థర్ఢ్‌వేవ్‌ను ఎలా ఎదుర్కొంటారని కేంద్రాన్ని ప్రశ్నించింది. దేశంలో...
06-05-2021
May 06, 2021, 15:23 IST
సాక్షి, మియాపూర్‌: ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి చనిపోయాడని ఓ వ్యక్తి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది....
06-05-2021
May 06, 2021, 15:16 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి లక్షలాది రూపాయలు ఫీజులుగా వసూలు చేస్తుండడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం...
06-05-2021
May 06, 2021, 14:36 IST
జైపూర్‌: దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. మొదటి దశలో కంటే సెకండ్‌వేవ్‌లో వైరస్‌ మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దీని...
06-05-2021
May 06, 2021, 14:06 IST
యాదగిరిగుట్ట: కరోనాతో బాధపడుతూ భర్త.. గుండెపోటుతో భార్య మృతి చెందింది. ఈ   సంఘటన భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో చోటు...
06-05-2021
May 06, 2021, 12:30 IST
వాషింగ్టన్: ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ మహమ్మారిని అడ్డుకట్టకు టీకాతోనే సాధ్యమని భావించి ఆయా దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ల తయారీ, ఉత్పత్తిలో...
06-05-2021
May 06, 2021, 11:43 IST
తిరువనంతపురం: కేరళలో కరోనా రెండో దశ విశ్వరూపం చూపిస్తోంది. రాష్ట్రంలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్‌ కట్టడికి కేరళ...
06-05-2021
May 06, 2021, 09:59 IST
ఒట్టావ: ఫైజర్ కరోనా వ్యాక్సిన్‌ ను 12 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లలకు టీకా వేసేందుకు కెనడా ఆరోగ్య...
06-05-2021
May 06, 2021, 08:06 IST
సాక్షి, గాంధీఆస్పత్రి( హైదరాబాద్‌): మనోధైర్యంతో కరోనా మహమ్మారిని జయించారు.. నాలుగు గోడల మధ్య ఒంటరిగా హోంక్వారంటైన్‌లో ఉంటూ పాజిటివ్‌ దృక్పథంతో...
06-05-2021
May 06, 2021, 06:06 IST
జెనీవా (స్విట్జర్లాండ్‌): ఈ ఏడాదికి వాయిదా పడ్డ యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను సాఫీగా జరిపేందుకు నడుం బిగించిన యూనియన్‌...
06-05-2021
May 06, 2021, 05:33 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మూడురోజుల పాటు కాస్త తగ్గుముఖం పట్టిన రోజువారీ కరోనా పాజిటివ్‌ కేసులు...
06-05-2021
May 06, 2021, 05:33 IST
సాక్షి, విశాఖపట్నం: దేశంలో విజృంభిస్తున్న కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌పై జరుగుతున్న సమరంలో భారత నౌకాదళం ఓ అడుగు ముందుకేసింది. ప్రస్తుత...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top