కరోనాతో కాంగ్రెస్‌ మహిళా ఎమ్మెల్యే మృతి

Madhya Pradesh Congress MLA Kalawati Bhuria Dies During Covid - Sakshi

12 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

భోపాల్‌: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. బీద, ధనిక, సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా చూపడం లేదు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కేసీఆర్‌, యోగి ఆదిత్యనాథ్‌ మొదలు రాహుల్‌ గాంధీ వరకు పలువురు రాజకీయ నాయకులు కూడా కోవిడ్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా కరోనాతో కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే ఒకరు మృతి చెందారు. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లా జోబట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కళావతి భూరియా కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆమె ఇండోర్‌లోని షాల్బీ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ 12 రోజుల అనంతరం ఆమె ప్రాణాలు విడిచారు.

ఆస్పత్రిలో చేరిన నాటికి కళావతి భూరియా ఊపరితిత్తులు 70 శాతం వరకూ పాడయ్యాయని.. ఆక్సిజన్ లెవెల్స్ కూడా దారుణంగా పడిపోయాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వివేక్ జోషి తెలిపారు. ఆక్సిజన్ లెవెల్స్ కేవలం 82 శాతం ఉన్నాయని చెప్పారు. ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించామని.. కానీ కాపాడలేకపోయామని ఆయన వెల్లడించారు.

2018లో జోబాట్ నియోజకవర్గం నుంచి కళావతి భూరియా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. కేంద్ర మాజీ మంత్రి కాంతిలాల్ భూరియాకి కళావతి మేనకోడలు. ఎమ్మెల్యే మరణంపై కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ చీఫ్ కమల్‌నాథ్ సంతాపం వ్యక్తం చేశారు. కళావరి మరణం భాధాకరమని, తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. కష్టపడే స్వభావం, చాలా యాక్టివ్‌గా ఉండే ఎమ్మెల్యే అని గుర్తుచేసుకున్నారు. ఎంపీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ సంతాపం తెలిపారు.

చదవండి: అవమానాలు భరించలేం, పార్టీలో నుంచి వెళ్లిపోదామా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top