గ్యాస్‌ రేట్లు మళ్లీ పెరుగుతాయా?.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు | LPG Price Hike Again In India, Global Energy Crisis Deepens As LPG Prices Increase Amid West Asia Conflict | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ రేట్లు మళ్లీ పెరుగుతాయా?.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

Jun 8 2026 11:51 AM | Updated on Jun 8 2026 12:26 PM

LPG price hike Again India: Iran War Union Minister Comments Confirms

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం కొనసాగుతున్న పరిస్థితులు.. ఈ ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఒత్తిడికి లోనవుతుండడం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇంధన ధరలపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా.. అటు పెట్రో రేట్లు పెరగడం, అలాగే ఇటు సిలిండర్లపైనా పెంపు అమల్లోకి రావడంతో, భవిష్యత్తులో మరిన్ని పెంపులు ఉండే అవకాశముందా? అనే ప్రశ్న వినియోగదారుల్లో కలకలం రేపుతోంది. ఇదే సమయంలో కేంద్రం చేసిన వివరణలు పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చాయి. 

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం కొనసాగుతున్న పరిస్థితులు.. ఆ ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఒత్తిడికి లోనవుతుండడం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. అదే సమయంలో.. వంటగ్యాస్ (LPG) ధరలపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా.. సిలిండర్‌పై రూ.29 పెంపు అమల్లోకి రావడంతో, భవిష్యత్తులో మరిన్ని పెంపులు ఉండే అవకాశముందా? అనే ప్రశ్న వినియోగదారుల్లో కలకలం రేపుతోంది. ఇదే సమయంలో కేంద్రం చేసిన వివరణలు పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చాయి.

డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ పెంపుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియా ముఖంగా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ ధరల పెంపు తప్పించలేని నిర్ణయంగా మారిందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ పెంపుపై విచారం వ్యక్తం చేస్తున్నప్పటికీ, సరఫరా పరిమితులు, రవాణా ఖర్చుల పెరుగుదల, బీమా వ్యయాలు అధికమవడం వంటి కారణాలతో ధరలను పూర్తిగా నియంత్రించడం సాధ్యం కావడం లేదని వివరించారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్పీజీ సరఫరా తగ్గడం, కొన్ని పరిమిత దేశాల నుంచే దిగుమతులు జరగడం, అలాగే 40–45 రోజుల ట్రాన్స్‌షిప్మెంట్ కారణంగా రవాణా వ్యయాలు భారీగా పెరగడం ధరల పెంపుకు ప్రధాన కారణాలుగా కేంద్రం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో దేశంలో ఎల్పీజీ సరఫరా వ్యయం రూ.1,600 దాటినప్పటికీ, ఆ భారాన్ని పూర్తిగా వినియోగదారులపై మోపకుండా ప్రభుత్వం సబ్సిడీల రూపంలో ఉపశమనం కల్పిస్తోందని తెలిపింది.

ఇదే సమయంలో భారత్‌లో వంటగ్యాస్ ధరలు ప్రపంచంలోనే తక్కువగా ఉన్నాయని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇక్కడ ధరలు గణనీయంగా చౌకగా ఉన్నాయని వివరించింది. ప్రస్తుతం ఢిల్లీలో సాధారణ వినియోగదారులు సిలిండర్‌కు సుమారు రూ.942 చెల్లిస్తుండగా, ప్రతి సిలిండర్‌పై దాదాపు రూ.700 వరకు ప్రభుత్వం భరిస్తోందని వెల్లడించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 10.58 కోట్లకుపైగా కనెక్షన్లు అందించగా, అర్హులైన లబ్ధిదారులకు ఏడాదికి నాలుగు సిలిండర్లపై ఒక్కో సిలిండర్‌కు రూ.300 సబ్సిడీ ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో ఉజ్వల వినియోగదారులకు సిలిండర్ ధర సుమారు రూ.642కే లభిస్తోందని వివరించింది.

మొత్తంగా చూస్తే, అంతర్జాతీయ సంక్షోభం కొనసాగుతున్నా భారత్‌లో వినియోగదారులపై భారం తగ్గించేందుకు భారీ సబ్సిడీలు, ప్రత్యామ్నాయ దిగుమతులు, దేశీయ ఉత్పత్తి పెంపు వంటి చర్యలు కొనసాగుతున్నాయని కేంద్రం చెబుతోంది. అయితే పశ్చిమాసియాలో మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఒత్తిడికి లోనవుతున్న నేపథ్యంలో, రాబోయే నెలల్లో ఎల్పీజీ ధరలు ఎలా మారతాయన్నదానిపై అనిశ్చితి కొనసాగుతోంది.

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలు కూడా ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా సరఫరా సమస్యలు, రవాణా వ్యయాలు, దిగుమతి ఒత్తిడులు కొనసాగుతున్న నేపథ్యంలో ధరలపై ఒత్తిడి తప్పదని ఆయన పేర్కొనడం భవిష్యత్తులో మరింత పెంపులు ఉండే అవకాశాలపై సంకేతాలుగా రాజకీయ, ఆర్థిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement