ఆంటీ ల్యాప్‌టాప్‌ ఇవ్వకపోతేనేం.. చిట్టితల్లి ఏం చేసిందో చూడండి!

Little Girl Made her Own Laptop - Sakshi

ఆంటీ తనకు ల్యాప్‌టాప్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఒక చిట్టి తల్లి తానే స్వయంగా ల్యాప్‌టాప్‌ను తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఈ ఉదంతాన్ని నేహా అనే యూజర్‌ సోషల్ మీడియాలో షేర్‌ చేశారు.  

ఆ చిన్నారి కార్డ్‌బోర్డ్‌తో తయారు చేసిన ‘హ్యాండ్‌మేడ్‌’ ల్యాప్‌టాప్ ఫొటోను నేహా షేర్‌ చేశారు. నేహా క్యాప్షన్‌లో ఇలా రాశారు ‘నా మేనకోడలు నన్ను ల్యాప్‌టాప్‌ కావాలని అడిగింది. నేను నిరాకరించడంతో, మూడు గంటల పాటు శ్రమపడి, ల్యాప్‌టాప్‌ తయారు చేసుకుంది’ నేహా షేర్‌ చేసిన ఫోటోలో ల్యాప్‌టాప్ ఆకారంలో కత్తిరించిన కార్డ్‌బోర్డ్ కటౌట్‌ కనిపిస్తుంది. దానిపై స్కెచ్ పెన్‌తో గీసిన కీబోర్టు చిహ్నాలు కనిపిస్తాయి. 

కాగా ఈ హోమ్‌మేడ్ ల్యాప్‌టాప్‌లో ‘గేమ్స్’, ‘జూమ్’, ‘లైక్’, ‘రైట్’, ‘సెలెక్ట్’ మొదలైన ఆప్షన్‌ బటన్లు కనిపిస్తాయి. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో త్వరగా వైరల్‌గా మారింది. 2,52,000కు పైగా వీక్షణలను దక్కించుకుంది. సోషల్ మీడియా యూజర్స్‌ ఆ చిన్నారి సృజనాత్మకతను ప్రశంసిస్తున్నారు. ఒక యూజర్‌ ‘ఈ ల్యాప్‌టాప్ ఉత్తమమైనది. విండోస్‌ ఎప్పటికీ ‍స్థిరంగా ఉంటాయి’ అని రాశారు. మరొకరు ‘ఈ ల్యాప్‌ టాప్‌ కీబోర్డ్‌లో చాలా ఎక్కువ ఆప్షన్లు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా మరింత మెరుగ్గా పని చేస్తుంది’ అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ‘బంగ్లా’లో డెంగ్యూ విధ్వంసం.. వెయ్యి దాటిన మృతులు!
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top