
న్యూఢిల్లీ: దేశంలో ఈ–ఎఫ్‌ఐఆర్‌ల (ఎల్రక్టానిక్ ప్రాథమిక సమాచార నివేదిక) రిజి్రస్టేషన్ ప్రక్రియను దశల వారీగా అమల్లోకి తీసుకురావాలని లా కమిషన్ సూచించింది. ఈ మేరకు తన నివేదికను ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.
తొలుత మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే నేరాల్లో ఈ–ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని వెల్లడించింది. ఈ–ఎఫ్‌ఐఆర్‌ల రిజిస్ట్రేషన్ కోసం దేశవ్యాప్తంగా కేంద్రీకృత జాతీయ పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించింది.