ఏఐ.. నమ్మించి, నట్టేట ముంచుతోందిలా.. | Why AI Produces False Information? | Sakshi
Sakshi News home page

ఏఐ.. నమ్మించి, నట్టేట ముంచుతోందిలా..

Nov 19 2025 10:03 AM | Updated on Nov 19 2025 10:59 AM

Why AI Produces False Information?

గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్ మరోసారి కృత్రిమ మేధస్సు (ఏఐ) ఫలితాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ చాట్‌బాట్‌లు తప్పుదారి పట్టించే సమాచారాన్ని అధికారిక రూపంలో వెల్లడిస్తున్నాయన్నారు. ఏఐలోని ఈ అంతర్గత లోపాలను సరిదిద్దకపోతే అవి వినియోగదారుల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని ఆయన హెచ్చరించారు. నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఏఐ శిక్షణ పొందిన తన డేటాలోని నమూనాల ఆధారంగా తదుపరి పరిణామాలను అంచనా వేసి, ఫలితాలను అందిస్తుంది. అయితే ఈ క్రమంలో పలు తప్పిదాలు దొర్లుతుంటాయి.

కల్పిత అవుట్‌పుట్‌లు: కృత్రిమ మేథ(ఏఐ) దాని వినియోగదారునికి నమ్మకం కల్పిందేందుకు కల్పిత సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది.

తప్పులను ఒప్పులుగా: ఏఐ తనలోని లోపాన్ని అంగీకరించే బదులు.. తప్పులను కూడా నమ్మించేలా చేస్తుంది.

అస్పష్టమైన ప్రాంప్ట్‌లు: వినియోగదారు అడిగిన ప్రశ్నపై స్పష్టత లేనప్పుడు,  ఏఐ ఆ అనిశ్చితిని అంగీకరించకుండా, ఏదో ఒక సమాధానాన్ని ఊహించి ఇస్తుంది.

ఇటువంటి సమస్యలు ఉద్దేశపూర్వక అబద్ధాలు కావని,  ఏఐ చాట్‌బాల్‌లోని నిర్మాణాత్మక లోపాలని సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. ఈ లోపాలను సరిదిద్దాలని ఆయన సూచించారు.

ఇటీవలి ఏఐ తప్పిదాలు
గూగుల్‌ జెమిని(2025): ఈ ఏఐ మోడల్ యూఎస్‌ వ్యవస్థాపక పితామహుల చిత్రాలను వారి జాతిపరంగా తప్పుగా రూపొందించింది. ఇది పక్షపాత ధోరణితో చేసినదంటూ చర్చకు తావిచ్చింది.

చాట్‌ జీపీటీ లీగల్ కేసు (2023–2024): న్యూయార్క్‌లోని న్యాయవాదులు చాట్‌బాట్‌ను నమ్మి.. అది అందించిన ఉనికిలో లేని కోర్టు కేసులను తమ న్యాయ పత్రాలలో పాటు సమర్పించారు. దీనిని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించి, సదరు న్యాయవాదులపై ఆంక్షలు విధించింది.

మైక్రోసాఫ్ట్‌ కాపీలాట్‌(2024): ప్రత్యక్ష పరిశోధనకు కనెక్ట్ కాని సందర్భాలలో పాత ఆర్థిక డేటాను తయారు చేసింది. ఇది ఆర్థిక విశ్వసనీయతపై ఆందోళనలను పెంచింది.

మెటా ఏఐ అసిస్టెంట్లు (2024): తప్పుడు కెరీర్ విజయాలతో ప్రముఖుల గురించి కల్పిత జీవిత చరిత్రలను సృష్టించాయి. తద్వారా వారి ప్రతిష్టకు భంగం కలిగించాయి.

ఈ విధమైన సమస్యల ను పరిష్కరించేందుకు టెక్ కంపెనీలు  చర్యలు చేపట్టాయి. గూగుల్‌ తన  జెమినిని మెరుగుపరుస్తోంది. అలాగే ఓపెన్‌ ఏఐ.. కల్పిత సూచనలను తగ్గించేందుకు సైటేషన్ ఫీచర్‌లను ప్రవేశపెట్టింది. మైక్రోసాఫ్ట్‌ రియల్-టైమ్ సెర్చ్ ఇంటిగ్రేషన్‌ను  మెరుగుపరుస్తోంది. పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వ్యవస్థలను రూపొందించేందుకు ఏఐ కంపెనీలు కృషి చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ఢిల్లీ బాంబర్ ప్లాన్: పుల్వామాలోని తన ఇంటికి వెళ్లి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement