దేశవ్యాప్తంగా 2023లో 4.8 లక్షల రోడ్డు ప్రమాదాలు
మృతులు 1.73 లక్షలు, గాయపడినవారు 4.62 లక్షలు
వానలాంటి ప్రతికూల వాతావరణంలో 22% ఘటనలు
దాదాపు నిమిషానికో రోడ్డు ప్రమాదం.. మూడు నిమిషాలకు ఒక మరణం.. ఇదీ దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద సంఘటనల తీరు. వాహనాల సంఖ్యకు తగ్గట్టుగా రోడ్డు ప్రమాదాలే కాదు.. క్షతగాత్రులు, మృతుల సంఖ్య సైతం ఏటా పెరుగుతూనే ఉన్నాయి.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2023లో దేశంలో 4,80,583 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వీటిలో 1.73 లక్షల మంది మరణించగా.. 4.62 లక్షల మంది గాయపడ్డారు. ప్రమాదాల్లో సుమారు 22 శాతం వర్షం, పొగమంచు లాంటి ప్రతికూల వాతావరణంలో జరిగాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్
భారత్‌లో 2024–25లో అన్ని విభాగాల్లో కలిపి 2,56,07,391 కొత్త వాహనాలు రోడ్డెక్కాయి. అంతకు ముందు రెండు ఆర్థిక సంవత్సరాల్లో సైతం ఏటా 2 కోట్ల పైచిలుకు వెహికల్స్ రోడ్లపైకి వచ్చాయి. వాహనాల సంఖ్యకు తగ్గట్టే ప్రమాదాలూ పెరుగుతున్నాయి.
2023లో దేశవ్యాప్తంగా గంటకు సుమారు 55 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ప్రమాద మృతుల్లో ద్విచక్ర వాహనదారులు ఏకంగా 44.8 శాతం ఉన్నారు. పాదచారులది (20.4 శాతం) ఆ తరువాతి స్థానం. ఇక గుంతల కారణంగా జరిగిన 5,840 ప్రమాదాల్లో 2,161 మంది కన్నుమూశారు.
ప్రతికూల వాతావరణంలో..
వాతావరణ పరిస్థితులు రోడ్డు ఉపరితల స్థితితోపాటు డ్రైవింగ్‌పైనా చూపుతాయి. రోడ్డు స్పష్టంగా కనిపించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి. భారీ వర్షం, దట్టమైన పొగమంచు, వడగళ్లు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు డ్రైవింగ్‌ను ప్రమాదకరంగా మారుస్తాయి.

వర్షం.. పొగమంచు






