ఎన్నికల్లో కలసికట్టుగా పోరాటం : సచిన్‌ పైలెట్‌ | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో కలసికట్టుగా పోరాటం : సచిన్‌ పైలెట్‌

Published Fri, Jul 7 2023 5:00 AM

Kharge to hold meet to sort out Gehlot-Pilot differences - Sakshi

న్యూఢిల్లీ: రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్,  అసంతృప్త నేత సచిన్‌ పైలెట్‌ మధ్య విభేదాలు రూపుమాప డానికి అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కలసికట్టుగా పోరాటం చేస్తామని సచిన్‌ పైలెట్‌ చెప్పారు.

రాజస్థాన్‌లో ఎన్నికల సన్నద్ధతపై గురువారం న్యూఢిల్లీలో  ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో రాహుల్‌గాంధీ, ఖర్గే, సచిన్‌ పైలెట్‌  ఇతర సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. కాలికి ఫ్రాక్చర్‌ కావడంతో సీఎం అశోక్‌ గెహ్లోత్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశానికి హాజరయ్యారు. 

Advertisement
 
Advertisement