మద్యం మత్తులో యువతి రైడ్‌ బుక్‌ చేసుకుంటే.. రూమ్‌కి తీసుకెళ్లి ప్రియురాలి ముందే అత్యాచారం

Kerala Woman Molested in Bengaluru, Three Arrested - Sakshi

సాక్షి, బెంగళూరు(బనశంకరి): సిలికాన్‌ సిటీలో దారుణం జరిగింది. ర్యాపిడో బైక్‌ డ్రైవరు స్నేహితునితో కలిసి కేరళ కు చెందిన యువతి మీద సామూహిక అత్యాచారం చేశారు. అది కూడా అతని ప్రియురాలి సమక్షంలోనే అకృత్యా­న్ని సాగించారు. ఈ ఘటన బెంగళూరు ఎల్రక్టానిక్‌ సిటీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. బిహార్‌కు చెందిన ర్యాపిడో బైక్‌ డ్రైవరు షహబుద్దీన్, అతని స్నేహితుడు అర్పత్‌ షరీఫ్, షహబుద్దీన్‌ ప్రియు­­రాలిని ఎల్రక్టానిక్‌ సిటీ పోలీసులు అరెస్టు చేశారు.  

మద్యం మత్తులో స్నేహితున్ని కలవాలని..  
వివరాలు.. గత  25వ తేదీ రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత కేరళ యువతి (22) మద్యం మత్తులో స్నేహితున్ని కలవాలని ర్యాపిడో బైకును బుక్‌చేసింది. దారి మధ్యలో యువతి డ్రైవరు షహబుద్దీన్‌ను సిగరెట్‌ అడిగింది. బైకు నిలిపిన అతడు సిగరెట్‌ కోసం వెళ్లాడు. తన ఫోన్‌ పే పనిచేయడం లేదని స్నేహితుడు అర్పత్‌ షరీఫ్‌కు కాల్‌ చేసి డబ్బు అడిగాడు. డబ్బు ఎందుకు అని అతడు అడగడంతో యువతిని డ్రాప్‌ చేయడానికి వెళుతున్నాను.

ఆమె మద్యం మత్తులో  సిగరెట్‌ అడిగింది అని వివరించాడు. యువతిపై అత్యాచారం చేయాలని ఇద్దరూ మాట్లాడుకుని షహబుద్దీన్‌ యువతిని తన రూమ్‌కు తీసుకెళ్లాడు. ఆమె మద్యం మత్తులో ఉండడంతో ఏమీ గ్రహించలేకపోయింది. ఇద్దరూ కలిసి ఆమెపై లైంగికదాడి చేశారు. ఈ సమయంలో షహబుద్దీన్‌ ప్రియురాలు కూడా అక్కడే ఉంది.  

ఆస్పత్రిలో చేరిక  
కొంతసేపటికి యువతిని గమ్యం వద్ద డ్రాప్‌ చేసి వెళ్లిపోయాడు. యువతికి శరీరంలో బాధ కనబడటంతో తనపై అత్యాచారం జరిగినట్లు అనుమానం వచ్చింది. బాయ్‌ ఫ్రెండ్‌కు చెప్పడంతో ఆసుపత్రిలో చేర్చాడు. డాక్టర్లు పరీక్షించి అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితులను అరెస్ట్‌ చేశారు.  

చదవండి: (టెన్త్‌ విద్యార్థినిపై తోటి విద్యార్థుల.. గ్యాంగ్‌రేప్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top