ఆయనెప్పుడైనా మొహం చూపించారా..?

Kejriwal Slams Bollywood Hero Sunnydeol - Sakshi

చండీగఢ్‌:‍ గదర్‌-2 హీరో సన్నీడియోల్‌పై ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఫైరయ్యారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ పర్యటన సందర్భంగా కేజ్రీవాల్‌ సన్నీడియోల్‌పై విమర్శల దాడి చేశారు. గురుదాస్‌పూర్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న సన్నీడియోల్‌ ఎప్పుడైనా మీకు మొహం చూపించారా అని ప్రజలను ప్రశ్నించారు. ఓటు వేసిన వారిని సన్నీడియోల్‌ మోసం చేశారని విమర్శించారు. 

‘సన్నీ డియోల్‌ను మీరు గెలిపించారు. గెలిచినప్పటి నుంచి నియోజకవర్గానికి అతడు మళ్లీ ఎప్పుడైనా వచ్చాడా? అతని ముఖాన్ని మీరేప్పుడైనా మళ్లీ చూశారా?. పెద్ద హీరో అనుకుని మనం అతనికి ఓట్లేశాం. అలాంటి  పెద్దవాళ్లను ఎన్నుకుంటే వాళ్లేం చేయరు. అందుకే సామాన్యుడిని(ఆమ్‌ఆద్మీ)ని గెలిపించాలి. ఆమ్‌ ఆద్మీ అయితే మీరెప్పుడు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేస్తాడు’ అని కేజ్రీవాల్‌ అన్నారు.

పంజాబ్‌లో ప్రతిపక్షాలపై కేజ్రీవాల్‌ మండిపడ్డారు. ఆపార్టీలకు ఆప్‌ ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప వేరే ఏం పనిలేదని విమర్శించారు. గత ప్రభుత్వం ఖాళీ చేసిన ఖజానాను ఏడాదిన్నరలో ఆప్‌ ప్రభుత్వం నింపిందన్నారు. ప్రజలకు ఉచిత విద్యుత్‌ లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని తెలిపారు.  

ఇదీచదవండి.. ‘24 గంటలు ఆగండి.. పూర్తి మెజార్టీ మాదే’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top