కరెంట్‌ బిల్లులు చెల్లించకపోతే నెక్స్ట్‌ జరిగేది ఇదే: విద్యుత్‌ శాఖ వార్నింగ్‌!

Karnataka: Bescom Asks Consumers Clear Your Bills Or Face Disconnection Over Govt Freebies - Sakshi

బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. అయితే మే 20న ప్రమాణస్వీకారం చేసిన సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో ‘సూత్రప్రాయంగా అంగీకరించినా’ దీనిపై తుది ప్రకటనతో విధివిధానాలను తెలపాల్సి ఉంది. అయితే ఈ హామీలు బెస్కాంను ఇబ్బందుల్లోకి నెడుతున్నట్లు కనిపి​స్తోంది.

చర్యలు తప్పవ్‌
త్వరలో ఉచిత విద్యుత్ పథకం ప్రకటన వస్తుందని ఆశిస్తున్న ప్రజలు వారి విద్యుత్ బిల్లులను చెల్లించడానికి నిరాకరిస్తున్నారు.  ఓ వైపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేక మరో వైపు వినియోగదారులు బిల్లులు చెల్లించక మధ్యలో బెస్కామ్‌ (బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్) నలిగిపోతోంది. దీంతో ఈ విషయంపై బెస్కామ్‌ సీరియస్‌గా తీసుకుంది. ప్రజలు తమ బిల్లులను వెంటనే చెల్లించాలని లేదా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఇదిలా ఉండగా గత వారంలో, చాలా మంది వినియోగదారులు బెస్కామ్‌ను సంప్రదించి దీని గురించి ఆరా తీశారు. ఇప్పటికే బిల్లులు చెల్లించిన వారిలో చాలా మంది ఇప్పుడు మొదటి 200 యూనిట్లను క్యాష్‌బ్యాక్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, నిర్ణీత గడువులోగా వినియోగదారులు వారి బిల్లులు తప్పక చెల్లించాలని బెస్కామ్ అధికారులు వినియోగదారులకు సూచించారు.

భారం ఎంతంటే..
రాష్ట్రంలో దాదాపు 2.1 కోట్ల మంది గృహ వినియోగదారులు ఉన్నారు, వీరిలో 1.26 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన (BPL) కుటుంబాలు ఉన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించే పథకం ద్వారా రాష్ట్ర ఖజానాకు నెలకు రూ.3,509 కోట్లు, ఏటా రూ.42,108 కోట్ల భారం పడనుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సహా ఐదు వాగ్దానాలపై తొలి కేబినెట్ సమావేశం అనంతరం సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘అవి అంగీకరించాం.. హామీలపై వెనక్కి వెళ్లబోమని చెప్పారు. 

చదవండి: కర్నూలులో దారుణం.. ఇంట్లో అట్టపెట్టెలతో భర్త మృతదేహాన్ని తగలబెట్టింది!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top