Karnataka: మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. జూన్‌ నుంచి వారికి ఉచిత బస్సు ప్రయాణం

Karnataka Announces Free Buses To Women Passengers - Sakshi

బెంగళూరు: కర్ణాటక మహిళలకు ఊరట లభించింది. కొత్తగా కొలువు తీరిన సిద్ధరామయ్య ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించింది. జూన్ 1 నుంచి మహిళలందరూ టికెట్టు కొనుగోలు చేయకుండానే బస్సుల్లో ప్రయాణించవచ్చని ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఆర్టీసీ ఎండీలతో సమావేశమైన అనంతరం మీడియా సమక్షంలో మంగళవారం ప్రకటించారు. 

నో అబ్జెక్షన్స్‌..
రాష్ట్రంలోని మహిళలందరూ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.. ఇందుకు ఎలాంటి షరతులు లేవని మంత్రి రామలింగా రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో మేనిఫెస్టోలోనూ తాము ఎలాంటి షరతులు లేకుండానే ఈ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. కేబినెట్ సమావేశం బుధవారం నిర్వహించి చర్చిస్తామని తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన ఖర్చులను సీఎంకు సమర్పించనున్నట్లు చెప్పారు. సీఎం సిద్ధరామయ్య కూడా రవాణా శాఖ ప్రధాన కార్యదర్శితో ఇప్పటికే ఈ అంశంపై చర్చించినట్లు వెల్లడించారు. 

ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో భాగంగా మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకా ప్రజలు గణవిజయాన్ని అందించారు. ఈ మేరకు కొత్త ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది.  

చదవండి:పతకాలను గంగలో కలిపేస్తామంటూ హెచ్చరిక.. హరిద్వార్‌కు చేరుకున్న రెజ్లర్లు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top