పతకాలను గంగలో కలిపేస్తామంటూ హెచ్చరిక.. హరిద్వార్‌కు చేరుకున్న రెజ్లర్లు

Wrestlers Said Will Throw Our Medals In Ganga Sit On Hunger Strike  - Sakshi

భారత అగ్ర రెజ్లర్ల నిరసన రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతోంది. శాంతియుతంగా చేపట్టిన నిరసన కాస్త ఘర్షణలకు దారితీయడంతో వారిలో ఆగ్రహవేశాలు కట్టలు తెంచుకుని నిరహారదీక్ష చేపట్టేందుకు దారితీసింది. ఈ మేరకు భారత అగ్ర స్థాయి రెజ్లర్లు తమ పతకాలను గంగా నదిలో విసిరేస్తాం, ఆ తర్వాత ఇండియా గేట్‌ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటామని గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రెజ్లర్లు హరిద్వార్‌కు చేరుకుని పతకాలను గంగలో కలిపేందుకు సిద్ధమయ్యారు.

అంతకుముందు రెజ్లర్‌​ సాకి మాలిక్‌ ‍ట్విట్టర్‌ వేదికగా తమ రెజ్లర్లంతా హరిద్వార్‌ వెళ్లి గంగా నదిలో సాయంత్రం 6 గంటలకు పతకాలను విసిరేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాము కష్టపడి సాధించిన పతకాలను గంగా నదిలో విసిరివేయకపోతే బతకడంలో ఎలాంటి అర్థం లేదు. కాబట్టి ఇండియా గేట్‌ వద్ద నిరాహార దీక్ష చేస్తాం అని ట్వీట్‌ చేశారు. అయిన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి.. రాజీపడి జీవించడంలో ప్రయోజనం లేదన్నారు. పార్లమెంట్‌ ప్రారంభోత్సవం వేళ మమ్మల్ని వేధింపులకు గురిచేసిన డబ్ల్యూఎఫ్‌ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌​ సింగ్‌ తెల్లటి దుస్తులు ధరించి అక్కడి దృశ్యాలను క్లిక్‌ మనిపించడం మమ్మల్ని కలిచివేసింది.

అతను అలా తెల్లటి దుస్తులు ధరించడంలో అర్థం తానే వ్యవస్థ అని చెప్పకనే చెప్పినట్లు ఉందని ట్విట్టర్‌లో రెజ్లర్లంతా కన్నీటి పర్యంతమయ్యారు. అందుకనే మాకు ఈ పతకాలు వద్దు. ‍ఆ వ్యవస్థ మాకు పతకాలు మెడలో వేసి ముసుగు వేసి గొప్ప ప్రచారం చేసుకుంటోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, భారత రెజ్లింగ్‌ సమాఖ్య(డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కి వ్యతిరేకంగా లైంగిక ఆరోపణల నేపథ్యంలో వినేష్‌ ఫోగట్‌, సాక్షి మాలిక్‌, బజరంగ పునియా తదితర రెజ్లర్లు ఏప్రిల్‌ 26 నుచి జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలు చేపట్టి సంగతి తెలిసిందే.

సుప్రీం కోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు శరణ్‌సింగ్‌పై రెండు కేసులు నమోదు చేశారు. ఐతే రెజ్లర్లు మాత్రం అతన్నిఅరెస్టు చేయాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో రైతులతో సహ చాలామంది మద్దతు వారికి లభించడం గమనార్హం. అదీగాక ఇటీవల జరిగిన కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవం వెలుపలు రెజ్లర్లు శాంతియుతంగా నిరసనలు చేసేందుకు యత్నించారు. ఐతే ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరిస్తూ వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దీంతో ఇరువురు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణణ వాతావరణం ఏ‍ర్పడింది. ఈ క్రమంలోనే రెజ్లర్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. నిరవధిక నిరహార దీక్షకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. 

(చదవండి: ఫోన్‌ కోసం డ్యామ్‌ నీటిని ఎత్తిపోసిన ఘటన..వృధా చేసిన నీటికి డబ్బు చెల్లించమంటూ లేఖ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top