ఫోన్‌ కోసం డ్యామ్‌ నీటిని ఎత్తిపోసిన ఘటన.. వృధా చేసిన నీటికి డబ్బు చెల్లించమంటూ లేఖ

Chhattisgarh Officer Said Pay For 21 Lakh Litres Water Drained  - Sakshi

చత్తీస్‌గఢ్‌లో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేష్‌ విశ్వాస్‌ ఫోన్‌ కోసం రిజర్వాయర్‌ నీటిని ఎత్తిపోయించడంతో సస్పెండ్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంద్రావతి ప్రాజెక్టు సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ ఫోన్‌ కోసం నీటిని వృధా చేసినందుకు గానూ అతడి జీతం నుంచి డబ్బులు ఎందుకు వసూలు చేయకూడదంటూ సబ్‌ డివిజనల్‌ అధికారి ఆర్కే ధివర్‌కు ఈనెల 26న లేఖ రాశారు. వృధాగా పోయిన 21 లక్షల నీటి కోసం ఆ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ వేతనం నుంచి డబ్బు వసూలు చేయండని అని లేఖలో పేర్కొన్నారు. 

వేసవిలో సాగు నీరు, ఇతర అవసరాల కోసం అన్ని రిజర్వాయర్లలో నీరు అవసరమని ఆ లేఖలో తెలిపారు. అయితే సదరు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేష్‌ విశ్వాస్‌ తన ఫోన్‌లో అధికారిక డిపార్టమెంటల్‌ డేటా ఉన్నందున దాన్ని తిరిగి పొందేందుకు యత్నించినట్టు తెలిపాడు. నిజానికి ఆ నీరు ఆ నిరుపయోగంగానే ఉందంటూ వాదిస్తున్నాడు. తాను వారాంతం కావడంతో తన స్నేహితులతో కలిసి కాంకేర్‌ జిల్లాలోని ఖేర్‌కట్టా డ్యామ్‌ వద్ద స్నానం చేయడానికి వెళ్లానని, సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు ఫోన్‌ డ్యామ్‌ నీటిలో పడిపోయిందని చెప్పాడు.

స్థానికులు ప్రయత్నించి విఫలమయ్యారు. అందులోని నీరుని రెండు నుంచి మూడడుగులు తోడిస్తే ఫోన్‌ దొరుకుతుందని అక్కడి వారు చెప్పడంతో.. ఎస్‌డీఓకి కాల్‌ చేసి అభ్యర్థించానని చెప్పుకొచ్చాడు. ఆయన అదేమంతా సమస్య కాదనడంతో ముందుకెళ్లానని చెబుతున్నాడు. మూడు, నాలుగు అడుగుల నీటిని తోడించగానే తన ఫోన్‌ దొరికేసిందని రాజేష్‌ చెప్పారు. ఎక్కువ మొత్తంలో నీరు ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతోనే కేవలం మూడు లేదా నాలుగు అడుగుల నీటిని తోడించేందుకు అంగీకరించానని, అందుకు స్థానికుల సాయం కూడా తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా జలవనరుల శాఖ అధికారి మాత్రం తాను ఐదడుగులు నీటిని తీసేందుకే పర్మిషన్‌ ఇచ్చానని చెబుతుండటం గమనార్హం. 
(చదవండిరూ.లక్ష ఫోన్ కోసం డ్యామ్‌లో నీటిని ఎత్తిపోశాడు.. తీరాచూస్తే..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top