Viral Video: గుట్టలు గుట్టలుగా చాక్లెట్లు.. ఎగబడిన జనం | Kanpur Viral Video: People Rush For Expired Chocolates | Sakshi
Sakshi News home page

Viral Video: గుట్టలు గుట్టలుగా చాక్లెట్లు.. ఎగబడిన జనం

Aug 25 2026 12:22 PM | Updated on Aug 25 2026 12:27 PM

Kanpur Viral Video: People Rush For Expired Chocolates

కాన్పూర్‌లోని పంకి పారిశ్రామిక ప్రాంతంలో ఓ చెత్తకుప్పలో గడువు ముగిసిన చాక్లెట్లు కోసం జనం ఎగబడ్డారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. భారీగా జనం ఓ చెత్త డంపింగ్‌ ప్రదేశం వద్ద గుమిగూడారు. గడువు ముగిసిన చాక్లెట్లు, టాఫీల కోసం ప్రజలు ఎగబడటం చర్చనీయాంశంగా మారింది. చాక్లెట్లు, టాఫీలు పడేసినట్లు సమాచారం అందగానే పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. కొందరు నేలపై పడిన స్వీట్లను చేతులతో ఏరుకుంటుండగా.. మరికొందరు బ్యాగులు, సంచులతో వచ్చి వీలైనన్ని చాక్లెట్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

ఓ ఫ్యాక్టరీ యజమాని గడువు ముగిసిన చాక్లెట్లు, టాఫీల బ్యాచ్‌ను అక్కడ పడేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం స్థానికంగా వ్యాపించడంతో కొద్దిసేపటికే అక్కడ భారీగా జనం చేరుకుని చాక్లెట్లను తీసుకెళ్లారు. అయితే ప్రజలు తీసుకెళ్లిన చాక్లెట్లను నిజంగానే తినేందుకు ఉపయోగించనున్నారా? లేక మరేదైనా అవసరానికి తీసుకెళ్లారా? అనేది వీడియోలో స్పష్టంగా తెలియడం లేదు. అయితే ఈ ఘటన ఆహార భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. వాటిని తినడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాగా, గడువు ముగిసిన, విక్రయించేందుకు అనర్హమైన ఆహార పదార్థాలను బహిరంగంగా పడేయకుండా.. నిర్దేశిత విధానంలో నాశనం చేయాల్సి ఉంటుంది. అవి తిరిగి ప్రజల చేతుల్లోకి వెళ్లకుండా నియంత్రిత పద్ధతిలో వాటిని నిర్వీర్యం చేయడం అవసరం. ఈ ఘటనలో మాత్రం చాక్లెట్లను బహిరంగ ప్రదేశంలో పడేశారు. దీంతో ప్రజలు వాటిని తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు వస్తున్నాయి.

 ఇదీ చదవండి: వైరల్‌ అవ్వాలని.. 3,400 ముద్దులు!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement