బ్యాగ్‌ సర్దుకోవాలన్నారు.. కంగనా గెలిచి చూపించింది | BJP's Kangana Ranaut Leading By 70000 Votes | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ గెలుపు

Jun 4 2024 2:03 PM | Updated on Jun 4 2024 2:38 PM

BJP's Kangana Ranaut Leading By 70000 Votes

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేసిన నటి 'కంగనా రనౌత్' విజయం సాధించింది.

కంగనా ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై తప్పకుండా విజయం సాధిస్తానని చెబుతూనే ఉంది. అన్నట్టుగానే ఇప్పుడు ఈమె సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఎన్నికల ప్రచార సమయంలో కంగనాను బ్యాగ్‌ సర్దుకుని బయలుదేరాలి అని ఎగతాళి చేశారు. ఈ వ్యాఖ్యలను కంగనా తీవ్రంగా విమర్శించారు.

ఒక మహిళ గురించి ఇంత తక్కువ మాట్లాడటం వల్ల కలిగే పరిణామాలను వారు తప్పకుండా చవిచూడాల్సి వస్తుంది. ఈ రోజు రాబోయే ఫలితాలే దానికి నిదర్శనం అని కంగనా అన్నారు. ప్రారంభం నుంచి బీజేపీ ప్రభుత్వం గెలుస్తుందని, మరోమారు మోదీ ప్రధాని అవుతారని కంగనా చెబుతూనే ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement