Jodhpur: కూడళ్లలో పాలు పంచిన పోలీసులు..

Jodhpur Police Distributed Milk on New Year - Sakshi

కొత్త సంవత్సరం 2024లోకి మనమంతా కాలుమోపాం. నూతన సంవత్సరం తొలి రోజును ఆనందంగా గడిపేందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు. అయితే రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ పోలీసులు నూతన సంవత్సరం వేళ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. 

జోధ్‌పూర్ పోలీసులు ఈ ఏడాది తొలిరోజున జనం చేత పాలు తాగించారు. నూతన సంవత్సరం వేళ నగరంలోని ప్రధాన కూడళ్లలో సామాన్యుల చేత పాలు తాగించిన పోలీసులు మద్యం సేవించవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా సరే మద్యానికి బదులుతా పాలు తాగాలని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ భూపాల్ సింగ్ లఖావత్ కోరారు. 

కాగా నగరంలోని పలు కూడళ్లలో పోలీసులు ఏర్పాటు చేసిన పాలకేంద్రాలకు భారీగా జనం తరలివచ్చారు. కొందరు అక్కడే పాలుతాగగా, మరికొందరు పాలను పాత్రలలో ఇళ్లకు వెళ్లారు. 

కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్‌లో నూతన సంవత్సరం సందర్భంగా పలువురు హుషారుగా నృత్యాలు చేశారు. చెన్నైలోనూ అర్థరాత్రి దాటిన తరువాత కూడా నూతన సంవత్సర వేడుకలు కొనసాగాయి. మెరీనా బీచ్‌కు చేరుకున్న జనం సంబరాల్లో మునిగిపోయారు. ఐటీ సిటీ బెంగళూరులోని ఎంజీ రోడ్డులో జనం ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. 
ఇది కూడా చదవండి: పూజల్లో యూపీ సీఎం.. సూర్య నమస్కారాల్లో గుజరాత్‌ సీఎం!
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top