జైన మతంతో భారత్‌కు గుర్తింపు  | Jainism played invaluable role in building India identity | Sakshi
Sakshi News home page

జైన మతంతో భారత్‌కు గుర్తింపు 

Apr 10 2025 5:49 AM | Updated on Apr 10 2025 6:07 AM

Jainism played invaluable role in building India identity

సవాళ్లకు పరిష్కారాలు జైన ధర్మంలో ఉన్నాయి  

ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి   

తొమ్మిది ప్రతిజ్ఞలు చేద్దామని ప్రజలకు పిలుపు  

న్యూఢిల్లీ: భారతదేశ గుర్తింపును నిర్మించడంలో జైన మతం అమూల్యమైన పాత్ర పోషించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, యుద్ధాలు, ధ్వంసమవుతున్న పర్యావరణం వంటి పెను సవాళ్లకు అసలైన పరిష్కార మార్గాలు జైన ధర్మంలో ఉన్నాయని ఉద్ఘాటించారు. ‘నవకర్‌ మహామంత్ర దివస్‌’ సందర్భంగా బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగించారు.

 జైన మతంతో ముడిపడి ఉన్న ప్రాచీన కట్టడాలు, జైన గురువుల బోధనలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. పార్లమెంట్‌ భవనంలో జైన తీర్థంకరుల విగ్రహాలకు స్థానం కలి్పంచినట్లు తెలిపారు. జైన మత  ప్రభావం మన పార్లమెంట్‌లో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. సమాజంలో ఒకరికొకరు సహకరించుకుంటూ శాంతియుతంగా జీవించాలని జైనిజం బోధిస్తున్నట్లు గుర్తుచేశారు. 

హింసను ఎంతమాత్రం అంగీకరించదని పేర్కొన్నారు. శాంతి, సౌభ్రాతృత్వం, పర్యావరణ పరిరక్షణను బోధించే జైనమత సూత్రాలు అందరికీ ఆచరణీయమని పిలుపునిచ్చారు. భారత ఆధ్యాతి్మక వైభవానికి జైన సాహిత్యం వెన్నుముకగా నిలుస్తోందని ప్రధాని మోదీ కొనియాడారు. జైన సాహిత్యాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రాచీన గ్రంథాలను డిజిటలైజ్‌ చేసే పథకం తీసుకొచ్చామని తెలిపారు. పాళీ, పాకృత బాషలను ప్రాచీన భాషలుగా గుర్తించామని వివరించారు.

మనమంతా తొమ్మిది ప్రతిజ్ఞలు చేద్దామని మోదీ సూచించారు. అవేమిటంటే... 
1. నీటిని సంరక్షించుకుందాం.. జల సంరక్షణ మనందరి బాధ్యత   
2. మాతృమూర్తి పేరిట ఒక మొక్క నాటుదాం 
3. పరిశుభ్రతను ప్రోత్సహిద్దాం 
4. స్థానిక ఉత్పత్తులనే ఉపయోగిద్దాం 
5. దేశంలో పర్యటిద్దాం.. పర్యాటకాన్ని ప్రోత్సహిద్దాం.. పేదలకు సాయం అందిద్దాం 
6. రసాయనాలకు తావులేకుండా  ప్రకృతి వ్యవసాయం చేద్దాం
7. ఆహారంలో భాగంగా తృణధాన్యాలు స్వీకరిద్దాం.. తద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుందాం.
8. వంట నూనెల వినియోగాన్ని కనీసం 10 శాతం తగ్గించుకుందాం
9. క్రీడలు, యోగాను మన నిత్యజీవితంలో ఒక భాగంగా మార్చుకుందాం   

Advertisement
 
Advertisement
Advertisement