హఫీజ్‌ సయీద్‌ను అప్పగించండి | India Formally Asks Pakistan To Extradite 26/11 Mumbai Terror Attaks Mastermind Hafiz Saeed, Says Sources - Sakshi
Sakshi News home page

26/11 Mumbai Terror Attacks Case: హఫీజ్‌ సయీద్‌ను అప్పగించండి

Published Fri, Dec 29 2023 5:16 AM

India formally asks Pakistan to extradite mumbai terrer attaks mastermind Hafiz Saeed - Sakshi

న్యూఢిల్లీ: 26/11 ముంబై దాడుల సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు అధికారికంగా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక వినతిని పాకిస్తాన్‌ ప్రభుత్వానికి పంపించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సయీద్‌ను అప్పగించడానికి చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరినట్లు  తెలియజేశాయి.

భారత్‌ రూపొందించిన మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలో హఫీజ్‌ సయీద్‌ ఉన్నాడు. అతడి తలపై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్‌ డాలర్ల బహుమానం ప్రకటించింది. 2008 నాటి ముంబై దాడులకు వ్యూహ రచన చేసిన హఫీజ్‌ సయీద్‌ను విచారించేందుకు భారత ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. అతడిని తమకు అప్పగించాలని భారత్‌ పదేపదే కోరుతున్నా పాకిస్తాన్‌ పట్టించుకోవడం లేదు.

 
Advertisement
 
Advertisement