భార్య నోటికి ఫెవిక్విక్‌ వేసిన భర్త..! | Husband Applies Fevikwik To Wife Mouth Over Doubt Of Extra Marital Affair In Karnataka, More Details Inside | Sakshi
Sakshi News home page

భార్య నోటికి ఫెవిక్విక్‌ వేసిన భర్త..!

Feb 13 2025 8:41 AM | Updated on Feb 13 2025 9:14 AM

Husband Applie Fevikwik To wife

సైకో భర్త దాష్టీకం

దొడ్డబళ్లాపురం(కర్ణాటక): భార్యకు అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో రాక్షసునిగా మారిన భర్త ఎవరూ ఊహించని పనిచేశాడు. ఆమె నోటికి ఫెవిక్విక్‌(Fevikwik)వేసి అతికించడంతో బాధితురాలు విలవిలలాడింది. ఈ సంఘటన నెలమంగల తాలూకా హారోక్యాతనహళ్లిలో చోటుచేసుకుంది. సిద్ధలింగయ్య, భార్య మంజుల దంపతులు ఉంటున్నారు.  ఇద్దరికీ 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మంజుల గార్మెంట్స్‌ ఫ్యాక్టరీలో పనికి వెళ్తోంది. 

సిద్ధలింగయ్య ఆయుర్వేద ఔషధ కంపెనీలో పని చేస్తున్నాడు. భార్యపై అనుమానంతో అతడు  తరచూ గొడవపడేవాడు. మంగళవారం అతని పైశాచికం శృతి మించింది. ఆమె పెదవులపై ఫెవిక్విక్‌ వేసి అతికించి పరారయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మాదనాయకనహళ్లి పోలీసులు బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు గమ్‌ను తొలగించారు. పోలీసులు సైకో భర్తని అరెస్టు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement