breaking news
Fevikwik
-
కుట్లకు బదులు ‘ఫెవిక్విక్’!
పసిబిడ్డ తలకు గాయమై రక్తమోడుతుంటే, తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. బిడ్డను కాపాడుకునేందుకు ఆసుపత్రికి పరుగులు తీశారు. కానీ, అక్కడి వైద్యుని నిర్వాకం మానవత్వాన్ని, వృత్తి ధర్మాన్ని ప్రశ్నార్థకం చేసింది. కుట్లు వేయాల్సిన చోట, రూ.5 విలువైన ’ఫెవిక్విక్’ (సూపర్ గ్లూ) పూశాడు. చికిత్స పేరుతో ఆ పసిబిడ్డపై దారుణ ప్రయోగం చేశాడు. రాత్రంతా నొప్పి తాళలేని బిడ్డ రోదన, తల్లిదండ్రులకు పీడకలగా మిగిల్చింది. ఫెవిక్విక్తో వైద్యం! ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరం జాగృతి విహార్‌కు చెందిన సర్దార్ జస్పిందర్ సింగ్ ఇంట్లో ఆడుకుంటున్న పసివాడి తల అనుకోకుండా టేబుల్ అంచుకు బలంగా తగిలింది. అంతే, రక్తం ధారగా కారిపోయింది. ఉలిక్కిపడ్డ తల్లిదండ్రులు, ఆలస్యం చేయకుండా బిడ్డను వెంటనే సమీపంలోని భాగ్యశ్రీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాధారణంగా తలకు గాయమై రక్తం వస్తుంటే, దాన్ని శుభ్రం చేసి కుట్లు వేయడం వైద్యుని విధి. కానీ, ఆ డాక్టర్.. రూ.5 విలువైన ఫెవిక్విక్ ట్యూబ్ కొనుక్కు రమ్మని చిన్నారి తల్లిదండ్రులను పురమాయించాడు. అదివిన్న తల్లిదండ్రులు షాకైనా, బిడ్డ గాయం తీవ్రత వల్ల ఏమీ మాట్లాడలేకపోయారు. వారు తెచి్చన గ్లూను డాక్టర్.. ఆ పసిబిడ్డ తలపై రక్తమోడుతున్న గాయంపై పూశాడు. గ్లూ అంటించడంతో.. నొప్పి తట్టుకోలేక చిన్నారి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వైద్యుడిని ప్రశి్నస్తే, ‘కాసేపట్లో నొప్పి తగ్గిపోతుంది’.. అని తేలిగ్గా కొట్టిపారేశాడట. కంగుతిన్న వైద్యులు ఆ రాత్రి ఆ బిడ్డ తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేదు. ఆ పసిబిడ్డ ఏడుపు, నొప్పి ఏమాత్రం తగ్గలేదు. దీంతో, తెల్లవారగానే బిడ్డను తీసుకొని లోకప్రియ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు గాయాన్ని పరిశీలించి కంగుతిన్నారు. తలమీద గట్టిగా అతుక్కుపోయిన ఆ జిగురును చూసి షాకయ్యారు. ఆ గట్టిపడిన అడ్హెసివ్ను (ఫెవిక్విక్‌ను) తొలగించడానికి మూడు గంటల సమయం పట్టింది. మొత్తానికి జిగురును తొలగించి, గాయాన్ని పూర్తిగా శుభ్రం చేసి, నాలుగు కుట్లు వేశారు. తల్లిదండ్రులు ఆ డాక్టర్ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒకవేళ ఫెవిక్విక్ గాయం నుంచి కారిపోయి కంట్లోకి పోయి ఉంటే, ఎంత ఘోరం జరిగేది? మా బిడ్డకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహించేవారు?’అని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశం.. ఈ దారుణ సంఘటనపై బాధిత చిన్నారి కుటుంబం నేరుగా.. మీరట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ కటారియా దృష్టికి తీసుకెళ్లింది. ‘చిన్నారి కుటుంబం ఫిర్యాదుపై ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక ఆధారంగా ఆ వైద్యునిపై తగిన చర్యలు తీసుకుంటాం’.. అని డాక్టర్ అశోక్ కటారియా తెలిపారు. బాధిత కుటుంబం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాల యం దృష్టికి కూడా తీసుకెళ్లింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భార్య నోటికి ఫెవిక్విక్ వేసిన భర్త..!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): భార్యకు అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో రాక్షసునిగా మారిన భర్త ఎవరూ ఊహించని పనిచేశాడు. ఆమె నోటికి ఫెవిక్విక్(Fevikwik)వేసి అతికించడంతో బాధితురాలు విలవిలలాడింది. ఈ సంఘటన నెలమంగల తాలూకా హారోక్యాతనహళ్లిలో చోటుచేసుకుంది. సిద్ధలింగయ్య, భార్య మంజుల దంపతులు ఉంటున్నారు. ఇద్దరికీ 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మంజుల గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనికి వెళ్తోంది. సిద్ధలింగయ్య ఆయుర్వేద ఔషధ కంపెనీలో పని చేస్తున్నాడు. భార్యపై అనుమానంతో అతడు తరచూ గొడవపడేవాడు. మంగళవారం అతని పైశాచికం శృతి మించింది. ఆమె పెదవులపై ఫెవిక్విక్ వేసి అతికించి పరారయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మాదనాయకనహళ్లి పోలీసులు బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు గమ్‌ను తొలగించారు. పోలీసులు సైకో భర్తని అరెస్టు చేశారు. -
‘ఫెవిక్విక్’ బామ్మ కన్నుమూత
ముంబై: ఫెవిక్విక్ బామ్మ పుష్ప జోషి(87) ఈ నెల 26న కన్నుమూశారు. గతవారం ఇంట్లో కాలుజారి పడిపోయిన పుష్ప ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా మంగళవారం మరణించారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ గుప్తా ఆమెకు నివాళి అర్పించారు. ఆమె మరణ వార్తపై విచారం వ్యక్తం చేశారు. ‘నేను దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఒకటైన ‘రైడ్’లో నీ నటన నాకు గుర్తుండిపోతుంది. నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ.. ఇతరులను నవ్విస్తూ ఉండేదానివి. మమ్మల్ని వీడి వెళ్లడం బాధాకరం. నిన్ను ఎంతగానో మిస్ అవుతాం బామ్మ..’ అంటూ ట్విటర్లో ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు. 85వ ఏటలో బాలీవుడ్లో అడుగుపెట్టిన పుష్ప జోషి అజయ్ దేవ్గన్ హీరోగా నటించిన ‘రైడ్’తో తొలిసారి వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే అందరి మనసులను గెలుచుకున్న ఆమె... ఆ తర్వాత ‘రాంప్రసాద్ కి తెహర్వీ’ చిత్రంలోనూ మెరిశారు. వీటికన్నా ముందు ఆమె కుమారుడు నిర్మించిన జాక్యా అనే షార్ట్‌ఫిల్మ్‌లోనూ నటించారు. చివరిసారిగా ‘ఫెవిక్విక్’ వాణిజ్య ప్రకటనలో కనిపించి ఫెవిక్విక్ బామ్మగా గుర్తింపు పొందారు. Very sad to hear about the passing away of Pushpa Joshi ji. One of the highlights of my directing career was watching you perform in RAID. You were a live wire on and off the sets. Wherever you are you will be smiling and spreading happiness Dadi ji. We will miss you. RIP. pic.twitter.com/TMleLe1oJA — Raj Kumar Gupta (@rajkumar_rkg) November 27, 2019 -
ఏడుస్తున్నాడని పెదాలను ఫెవీక్విక్‌తో ...
పట్నా : కడుపున పుట్టిన బిడ్డ పట్ల కన్నతల్లే కర్కశంగా వ్యవహరించింది. సాధారణంగా పిల్లలు ఏడుస్తుంటే...ఆపమని అదిలిస్తాం....బెదిరిస్తాం. అప్పటికీ వాళ్లు ఆపకుంటే ’రెండంటిస్తాం’ అని చెబుతాం. అయితే ఆపకుండా ఏడుస్తున్న కొడుకు నోరు మూయించేందుకు .... ఓ తల్లి...ఏకంగా అతగాడి పెదాలకు ఫెవీక్విక్ (గమ్) రాసి, అంటించేసింది. అయితే ఈ విషయాన్ని గమనించిన తండ్రి... కొడుకును ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. ప్రస్తుతం చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించడంతో తండ్రి ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సంఘటన బిహార్‌లోని చాహాప్రాలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధిత చిన్నారి తండ్రి మాట్లాడుతూ...’పనుండి బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాను. నేను వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బాబు ఏడవడం లేదు. అయితే అతడి నోటి నుంచి నురుగు వస్తోంది. దాంతో ఏం జరిగిందని నా శోభను భార్యను అడిగాను. ఆపకుండా ఒకటే ఏడుస్తున్నాడని, అందుకే కొడుకు ఏడుపు ఆపేందుకు గమ్ రాసినిట్లు చెప్పింది.’ అని పేర్కొన్నాడు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఔరా! తాగొచ్చిన భర్త కళ్లకు ఫెవిక్విక్..
ఆమె భర్త నిత్యం తాగొచ్చి గొడవ పడేవాడు. ఆ తాగుబోతు భర్తతో ఆమె వేగలేకపోయింది. అతనికి బుద్ధిచెప్పాలనుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఇంతలోనే భర్త ఎప్పటిలాగే తాగొచ్చి గొడవకు దిగాడు. విసుగు చెందిన ఆమె అతడు నిద్రపోయింది చూసి.. కళ్లకు 'ఫెవిక్విక్' గమ్ (జిగురు) పెట్టింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రెవా జిల్లాలో జరిగింది. సంతోష్ విశ్వకర్మ నిత్యం తాగొచ్చి భార్యతో గొడవ పెట్టుకునేవాడు. దీంతో అతనికి బుద్ధి చెప్పాలని భార్య విజయలక్ష్మి సంకల్పించింది. తాగొచ్చి నిద్రపోతున్న భర్త కళ్లకు ఫెవిక్విక్ గమ్ పెట్టింది. సంతోష్ ఉదయం నిద్రం లేచి భార్యను పిలిచాడు. భార్య అప్పటికే ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంత ప్రయత్నించినా సంతోష్ కళ్లు తెరుచుకోలేదు. కళ్లపై నీళ్లు చల్లినా లాభం లేకపోవడంతో పొరుగువారి సహాయంతో వైద్యుల దగ్గరికి వెళ్లాడు. కంటి వైద్యులు కాస్తా వేడిచేయడం ద్వారా ముసుకుపోయిన కనురెప్పలు తెరుచుకునేలా చేశారు. ఇప్పుడు బాగానే కళ్లు కనిపిస్తున్న సంతోష్.. భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో విచారిస్తున్నాడు.


