స్వప్న చౌదరి పాటకు ఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌ డ్యాన్స్‌ | Haryana SP And Inspector Dances To Sapna Chaudhary Song | Sakshi
Sakshi News home page

స్వప్న చౌదరి పాటకు ఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌ డ్యాన్స్‌

Feb 26 2021 3:51 PM | Updated on Feb 26 2021 4:49 PM

Haryana SP And Inspector Dances To Sapna Chaudhary Song - Sakshi

వీడియో దృశ్యం

ఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌ కలిసి మాస్‌ పాటకు స్టెప్పులేసిన వీడియో నెట్టింట...

హర్యానా : సోషల్‌ మీడియాలో వైరల్‌ వీడియోలకు కొదువ లేదు. నిత్యం ఏదో ఒక వీడియో వైరల్‌గా మారి ప్రజల్ని ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఓ ఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌ కలిసి మాస్‌ పాటకు స్టెప్పులేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. హార్యానాకు చెందిన ఐపీఎస్‌ అధికారి ఆర్కే విజ్‌, ఇన్‌స్పెక్టర్‌ దీపాన్షూ కద్రలు కొద్దిరోజుల క్రితం ఓ ఫంక్షన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆఫ్‌ డ్యూటీలో ఉన్న వారు ప్రముఖ డ్యాన్సర్‌ స్వప్న చౌదరి పాట ‘‘ గజ్‌బని పని లే చాలి’’కు డ్యాన్స్‌ వేశారు. డాక్టర్‌ మౌనికా సింగ్‌ అనే ట్విటర్‌ ఖాతాదారిణి ఇందుకు సంబంధించిన వీడియోను గురువారం తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేశారు.

ఈ వీడియో ప్రస్తుతం 30 వేలకు పైగా వీక్షణలు, 1000పైగా లైక్స్‌ సొంతం చేసుకుంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘వాళ్లు కూడా మనుషులే’’.. ‘‘డ్యాన్స్‌ అద్భుతంగా చేశారు’’.. ‘‘ యూనీఫార్మ్‌ లేకపోతే వాళ్లు కూడా సాధారణ మనుషులే, వాళ్లకు కూడా ఎంజాయ్‌ చేసే హక్కు ఉంది’’అని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఇన్‌స్పెక్టర్‌ కద్ర.. వీడియోను రీట్వీట్‌ చేశారు. ‘‘ వీడియోలో ఉన్నది ఐపీఎస్‌ ఆర్కే విజ్‌, నేను.. ఓ ఫంక్షన్‌లో అలా డ్యాన్స్‌ చేశాం’’ అని పేర్కొన్నారు.

చదవండి : ఫ్రాంక్‌తో తల్లిని హడలుగొట్టిన కుమారులు 

డ్రైనేజీలో తండ్రి అస్థికలు కలిపిన కొడుకు.. కారణం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement