కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. బీజేపీలో చేరిన ‘హస్తం’ ఎమ్మెల్యే! | Former Gujarat Congress President And Senior Leader Arjun Modhwadia Joins BJP- Sakshi
Sakshi News home page

Gujarat: కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. బీజేపీలో చేరిన ‘హస్తం’ ఎమ్మెల్యే!

Mar 5 2024 1:27 PM | Updated on Mar 5 2024 1:33 PM

Gujarat Leader Arjun Modhvadia Joins BJP - Sakshi

కాంగ్రెస్‌ ‘హస్తం’ నుంచి మరో ఎమ్మెల్యే చేజారిపోయారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ నేత, ఎమ్మెల్యే అర్జున్ మోద్వాడియా తాజాగా బీజేపీలో చేరారు. ఆయనతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ బడానేతలు కూడా బీజేపీలో చేరారు. వీరిలో మాజీ ఎమ్మెల్యేలు అంబరీష్ ధేర్, ములుభాయ్ కందేరియా ఉన్నారు.

గుజరాత్‌లో బలమైన ప్రతిపక్ష నేతగా మోద్వాడియా పేరు సంపాదించారు. 2022 ఎన్నికల్లో పోర్‌బందర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నేత బాబు బోఖిరియాను ఓడించారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ మార్చి 7న గుజరాత్‌లోకి ప్రవేశించబోతున్న సమయంలో ఆయన బీజేపీలో చేరడం చర్చనీయాంశంగామారింది. 

దాదాపు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్‌తో అనుబంధం కలిగిన మోద్వాడియా .. రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమ ఆహ్వానాన్ని పార్టీ అధిష్టానం తిరస్కరించడాన్ని తప్పుబట్టారు. మోద్వాడియా ప్రస్తుతం పోర్‌బందర్‌ ఎమ్మెల్యే. కాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంబరీష్ దేర్ కూడా బీజేపీలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా దేర్‌ను గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శక్తి సింగ్ గోహిల్ సస్పెండ్ చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement