భారత్‌ నేతృత్వంలో జీ20 శిఖరాగ్రం ఓ ముందడుగు | G20 joint declaration was unexpected, says Russian foreign minister | Sakshi
Sakshi News home page

భారత్‌ నేతృత్వంలో జీ20 శిఖరాగ్రం ఓ ముందడుగు

Sep 11 2023 6:11 AM | Updated on Sep 11 2023 6:11 AM

G20 joint declaration was unexpected, says Russian foreign minister - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ సారథ్యంలో జరిగిన జీ20 శిఖరాగ్రం ఓ ముందడుగని రష్యా పేర్కొంది. జీ20 సదస్సు సాధించిన ఫలితాలు..సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగడానికి ప్రపంచానికి ఒక మార్గాన్ని చూపించాయి, గ్లోబల్‌ సౌత్‌ ప్రాముఖ్యాన్ని చాటాయని తెలిపింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌ సహా అనేక అంశాల్లో తమ వైఖరిని రుద్దేందుకు పశ్చిమదేశాలు చేసిన యత్నాలను అడ్డుకోవడంలో భారత్‌ కీలక పాత్ర పోషించిందని కొనియాడారు.

ప్రపంచదేశాల్లో సైనిక సంక్షోభాలను ఐరాస చార్టర్‌ను అనుసరిస్తూ పరిష్కరించాలే తప్ప, వివిధ సంక్షోభాల పరిష్కారానికి పశ్చిమదేశాలు తమ సొంత వైఖరులతో ముందుకు సాగడానికి వీల్లేదన్న సందేశాన్ని ఈ శిఖరాగ్రం స్పష్టంగా పంపిందని లావ్రోవ్‌ చెప్పారు. ‘ఈ శిఖరాగ్రం ఎన్నో విధాలుగా ఓ ముందడుగు వంటిది. అనేక సమస్యలపై ముందుకు సాగడానికి ఇది మార్గం చూపింది’అని అన్నారు. ‘జీ20ని రాజకీయ వేదికగా మార్చేందుకు జరిగిన యత్నాలను అడ్డుకున్న భారత్‌కు ధన్యవాదాలు. అంతర్జాతీయ వేదికపై పశ్చిమ దేశాలు ఆధిపత్యం కొనసాగించలేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement