ఇటుక బట్టీలో భారీ పేలుడు.. నలుగురు మృతి! | Sakshi
Sakshi News home page

West Bengal: ఇటుక బట్టీలో భారీ పేలుడు.. నలుగురు మృతి!

Published Thu, Dec 14 2023 9:38 AM

Four Dead and 25 Injured in Brick Kiln Furnace Blast - Sakshi

పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణా జిల్లాలోని ఒక ఇటుక బట్టీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో చిమ్నీ కూలిపోయి నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో 25 మందికి పైగా కూలీలు గాయపడ్డారు. ఈ ఘటనపై ఫోరెన్సిక్ విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. 

ఈ ఘటన బసిర్‌హత్‌లోని ధాల్‌టితా గ్రామంలో చోటుచేసుకున్నదని పోలీసులు తెలిపారు. ఇటుక బట్టీలో పొయ్యి మండుతుండగా పేలుడు సంభవించిందని చెబుతున్నారు. ఈ విషయమై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన వారంతా ఇటుక బట్టీ కార్మికులేనని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, శిథిలాల కింద ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోందని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం భారీ పేలుడు థాటికి ఇటుక బట్టీలోని చిమ్నీ పూర్తిగా కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. కాగా ఈ పేలుడు వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
ఇది కూడా చదవండి: కిడ్నీ దానంతో భర్త ప్రాణాలు కాపాడిన భార్య!

Advertisement
 
Advertisement