
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ) చైర్మన్‌గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ నియమితుల య్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. యూపీఎస్సీ చైర్మన్ పదవి గత నెల 29 నుంచి ఖాళీగా ఉంది.
నూతన చైర్మన్‌గా అజయ్ కుమార్ నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించినట్లు అధికారులు తెలిపారు. అజయ్ కుమార్ 1985 బ్యాచ్‌కు చెందిన కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి. 2019 ఆగస్టు 23 నుంచి 2022 అక్టోబర్ 31 దాకా రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. యూపీఎïస్సీలో చైర్మన్ తోపాటు గరిష్టంగా 10 మంది సభ్యులుంటారు. ప్రస్తుతం రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.