
న్యూఢిల్లీ: మహారాష్ట్ర స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్(ఎంఎస్‌సీబీ)కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు చెందిన షుగర్ మిల్‌ను అటాచ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం తెలిపింది. రూ.65 కోట్ల విలువైన జరందేశ్వర్ సహకారీ షుగర్ కార్ఖానా(జరందేశ్వర్ ఎస్‌ఎస్‌కే) యంత్ర సామగ్రి, భవనం, స్థలం, కర్మాగారాలను అటాచ్ చేసినట్లు పేర్కొంది.
2010లో ఈ ఆస్తులను అజిత్ పవార్ ఆయన భార్య సునేత్ర రూ.65.75 కోట్లకు కొనుగోలు చేశారని వివరించింది. ఎంఎస్‌సీబీ అధికారులు, డైరెక్టర్లు కుమ్మక్కై జరందేశ్వర్ ఎస్‌ఎస్‌కేను నామమాత్రం ధరకే అయిన వారికి కట్టబెట్టారన్న ఆరోపణలపై బాంబే హైకోర్టు ఆదేశాలపై 2019లో ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
చదవండి: చనిపోయాడనుకున్న వ్యక్తి ప్రత్యక్షమవడంతో..