కట్నం డిమాండ్‌ చేయడం  క్రూరత్వం కాదు: సుప్రీంకోర్టు | Dowry Demand Not Needed To Invoke Cruelty Charge Against Husband | Sakshi
Sakshi News home page

కట్నం డిమాండ్‌ చేయడం  క్రూరత్వం కాదు: సుప్రీంకోర్టు

Feb 22 2025 6:02 AM | Updated on Feb 22 2025 9:45 AM

Dowry Demand Not Needed To Invoke Cruelty Charge Against Husband

న్యూఢిల్లీ: భార్య నుంచి భర్త కట్నం డిమాండ్‌ చేయడాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. భర్త, అత్తమామల నుంచి వివాహిత మహిళలకు రక్షణ కల్పించేందుకు 1983లో ప్రవేశపెట్టిన ఐపీసీ సెక్షన్‌ 498ఏ ప్రకారం.. కట్నం డిమాండ్‌ చేయడాన్ని క్రూరమైన నేరంగా భావించలేమని వెల్లడించింది. సెక్షన్‌ ప్రకారం 498ఏ ప్రకారం క్రూరత్వం అనేపదానికి విస్తృతమైన అర్థం ఉంది. 

కట్నం కింద ఆస్తులు గానీ, విలువైన వస్తువులు గానీ ఇవ్వాలని డిమాండ్‌ చేయడం చట్టవిరుద్ధమే. అయితే, కట్నం కోసం మహిళను శారీరకంగా, మానసికంగా వేధించడం క్రూరత్వం అవుతుంది. కేవలం కట్నం డిమాండ్‌ చేశారని 498ఏ సెక్షన్‌ కింద కేసు పెట్టకూడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ ప్రసన్న బి.వరాలీతో కూడిన ధర్మాసనం గత ఏడాది డిసెంబర్‌ 12న ఆదేశాలు జారీ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement