భారత్‌లో 16,522కు యాక్టివ్‌ కేసులు | Covid-19:India reports 2,541 new case | Sakshi
Sakshi News home page

భారత్‌లో 16,522కు యాక్టివ్‌ కేసులు

Apr 26 2022 4:40 AM | Updated on Apr 26 2022 7:35 AM

Covid-19:India reports 2,541 new case - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో సోమవారం కొత్తగా 2,541 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,60,086కు చేరుకున్నట్లు కేంద్రం తెలిపింది. యాక్టివ్‌ కేసులు 16,522కు పెరిగినట్లు పేర్కొంది. 24 గంటల వ్యవధిలో మరో 30 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందడంతో మొత్తం మరణాలు 5,22,223గా నమోదయ్యాయని తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.04%గా ఉన్నట్లు వివరించింది. అదేవిధంగా, దేశ రాజధాని ఢిల్లీలో మరో 1,022 కరోనా కేసులు సోమవారం వెలుగుచూశాయి. ఐఐటీ మద్రాస్‌లో సోమవారం మరో 18 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 78కి చేరింది.

Advertisement
 
Advertisement
Advertisement