కాంగ్రెస్‌ హై కమాండ్‌కు ఏటీఎంలా రాజస్థాన్‌ : అమిత్‌ షా

Congress high command used rajastan as ATM says Amith Sha - Sakshi

జైపూర్‌ : కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజస్థాన్‌ను కాంగ్రెస్‌ ఢిల్లీ పెద్దలు ఏటీఎమ్‌లా వాడుకున్నారని, ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్డు గీకి డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. సీఎం అశోక్‌గెహ్లాట్‌ ఆయన పార్టీ ఢిల్లీ పెద్దలకు రాజస్థాన్‌ను ఏటీఎంలాగా వాడుకునే సదుపాయాన్ని కల్పించారని ఎద్దేవా చేశారు. రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా అజ్మీర్‌లోని విజయనగర్‌లో జరిగిన సభలో అమిత్‌ షా ప్రసంగించారు. 

అవినీతిలో రాజస్థాన్‌ దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉందని అమిత్‌ షా విమర్శించారు. మహిళల పట్ల నేరాల్లో,సైబర్‌ నేరాల్లో రాజస్థాన్‌ టాప్‌లో ఉందన్నారు. ఇక్కడి ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. 

ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడంలో గెహ్లాట్‌ ప్రభుత్వం అన్ని హద్దులు దాటేసిందని అమిత్‌ షా ఫైర్‌ అయ్యారు. కన్హయ్యలాల్‌ను పట్టపగలు చంపితే  ప్రభుత్వ పెద్దలు ఒక్కరూ ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. రాజస్థాన్‌ను గెహ్లాట్‌ అల్లర్ల రాష్ట్రంగా మార్చారన్నారు.  

ఇదీచదవండి.. ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం: పరుగులు తీసిన జనం

  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top