‘ఆప్‌’తో కాంగ్రెస్‌ పొత్తు ఖరారు.. సీట్ల లెక్కలివే..! | Congress Alliance with AAP | Sakshi
Sakshi News home page

Lok Sabha Elections- 2024: ‘ఆప్‌’తో కాంగ్రెస్‌ పొత్తు ఖరారు.. సీట్ల లెక్కలివే..!

Feb 22 2024 11:24 AM | Updated on Feb 22 2024 11:45 AM

Congress Alliance with AAP - Sakshi

లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సంబంధించి అన్ని పార్టీల్లోనూ  ఉత్సాహం నెలకొంది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌ తాజాగా సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీలతో పొత్తు కుదుర్చుకుని ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. 

ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్‌కు పొత్తు కుదిరాక ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీతో కూడా కాంగ్రెస్‌కు పొత్తు కుదిరిన నేపధ్యంలో ఈ రెండు పార్టీల మధ్య కూడా సీట్ల పంపకం ఖరారైనట్లు తెలుస్తోంది. 

ఢిల్లీ, గుజరాత్, అసోం, హర్యానాలలోని లోక్‌సభ స్థానాల టిక్కెట్ల కేటాయింపుపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ఒప్పందం దాదాపు ఖరారైనట్లు సమాచారం. దీని ప్రకారం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీ చేయనుంది. గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ రెండు సీట్లు ఇవ్వగా, హర్యానా, అసోంలో ఒక్కో సీటు కేటాయించేందుకు ఒప్పందం కుదిరింది.

సీట్ల పంపకానికి సంబంధించి కాంగ్రెస్‌తో చర్చలు చివరి దశలో ఉన్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే ప్రకటించారు. కాగా పంజాబ్‌లో పోటీకి  సంబంధించి ఈ రెండు పార్టీల మధ్య ఇంకా ఒక నిర్ణయం కుదరలేదని తెలుస్తోంది. ఇక్కడ రెండు పార్టీలు ఒంటరిగానే పోటీ చేస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement