విద్యార్థిని అనుమానాస్పద మృతి.. లైంగిక దాడికి పాల్పడి హత్య? | College Principal Booked After Student Found Dead In PUC Hostel | Sakshi
Sakshi News home page

విద్యార్థిని అనుమానాస్పద మృతి.. లైంగిక దాడికి పాల్పడి హత్య?

Feb 5 2023 8:51 AM | Updated on Feb 5 2023 9:02 AM

College Principal Booked After Student Found Dead In PUC Hostel - Sakshi

మృతురాలు (ఫైల్‌)

సాక్షి, బెంగళూరు: పీయూసీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన  లింగసూగురులో చోటు చేసుకుంది. అయితే తన కుమార్తెపై ప్రిన్సిపాల్‌ లైంగిక దాడికి పాల్పడి హత్య చేశాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లింగసూగూరు తాలూకా గోనవాట్ల తండాకు చెందిన  యువతి  లింగసూగూరులోని ప్రైవేటు పీయూసీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. అక్కడే హాస్టల్‌లో ఉంటోంది. ఏం జరిగిందో ఏమో కాని తన గదిలో శుక్రవారం ఉరి వేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించింది.

పోలీసులు వచ్చి పరిశీలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా తన కుమార్తెను ప్రిన్సిపాల్‌ లైంగికంగా వేధించేవాడని, ఈక్రమంలోనే శుక్రవారం లైంగిక దాడికి పాల్పడి ఓణితోనే ఉరివేసి హత్య చేశాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మంజునాథ తెలిపారు.  
చదవండి: ‘హాయ్‌ అమ్మా, నాన్న.. ఈ స్ట్రెస్‌ తీసుకోలేకపోతున్నాను.. క్షమించండి!’

Advertisement
 
Advertisement
Advertisement