‘హాయ్‌ అమ్మా, నాన్న.. ఈ స్ట్రెస్‌ తీసుకోలేకపోతున్నాను.. క్షమించండి!’

10th Student Committed Suicide Due To Stress At Miyapur - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒత్తిడి తట్టుకోలేక  టెన్త్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మియపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాఘవేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం... ఈస్ట్‌ గోదావరి జిల్లాకు చెందిన రాయుడు శ్రీ వెంకటేశ్వర్లు కుటుంబం కేవీఆర్‌ టవర్స్‌లో నివాసముంటోంది. కుమార్తె సంజన(14) పటాన్‌చెరు బీరంగూడలోని అకడమిక్‌ పబ్లీక్‌ స్కూల్‌లో పదవ తరగతి చదువుతోంది. తండ్రి ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా తల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.

శుక్రవారం సంజన పాఠశాలకు వెళ్లి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చింది. అనంతరం తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. చాలా సేపటి వరకు సంజన బయటికి రాకపోవడంతో తల్లి శిరీష, సోదరుడు మోహిత్‌లు తలుపులు తట్టగా ఎలాంటి ఉలుకు, పలుకు లేదు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా సీలింగ్‌ ప్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

ఓ పేపర్‌పై హాయ్‌ అమ్మా... నాన్న.. మోహిత్‌ నేను అసలు ఈ స్ట్రెస్‌ తీసుకోలేకపోతున్నాను దయచేసి నన్ను క్షమించండి... ఐ లవ్‌ యూ అని రాసి పెట్టి ఆత్మహత్యకు పాల్పడిందని గుర్తించారు. చదువులో ఒత్తిడి భరించలేకే ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రాథమిక అంచనలో తేలింది.  

మరిన్ని వార్తలు :

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top