Coimbatore police begins search operation for Thammana gang - Sakshi
Sakshi News home page

తమన్నా లేడీ రౌడీ గ్యాంగ్‌ హల్‌చల్‌.. సంచలనంగా మారిన వీడియో​

Mar 10 2023 2:00 PM | Updated on Mar 10 2023 3:12 PM

Coimbatore Police Searching Operation For Thamana Gang - Sakshi

కోయంబత్తూర్‌లో ఓ లేడీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేస్తోంది. ఓ లేడీ కొందరు యువకులను వెంటబెట్టుకుని హంగామా చేస్తోంది. కాగా, గ్యాంగ్‌లో ఉన్న వారంత మారణాయుధాలు చేతిలో పట్టుకుని వీడియోలో ఫోజులు ఇవ్వడం కలకలం సృష్టించింది. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు.. లేడీ రౌడీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

వివరాల ప్రకారం.. కోయంబత్తూరులోని విరుదునగర్‌కు చెందిన వినోదిని అలియాస్‌ తమన్నా(23) స్థానికంగా హల్‌చల్‌ చేస్తోంది. ఈ లేడీ రౌడీ కొంత మంది యువకులతో ‍గ్యాంగ్‌ ఏర్పాటు చేసింది. ఈ గ్యాంగ్‌ వారం క్రితం ఓ యువకుడిని హత్య చేసింది. అయితే, స్థానికంగా ఉన్న మరో గ్యాంగ్‌(గౌతమ్‌ గ్యాంగ్‌)తో నెల రోజులుగా రెండు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లేడీ గ్యాంగ్‌ మరో గ్యాంగ్‌లోని వ్యక్తిని హత్య చేశారు. అనంతరం, లేడీ రౌడీ మారణాయుధాలు చేతిలో పట్టుకుని సిగరెట్‌ తాగుతూ.. వీడియోలు ఫోజులు ఇస్తూ అవతలి గ్యాంగ్‌కు వార్నింగ్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక, ఈ వీడియోపై పోలీసులు దృష్టి సారించారు. ప్రత్యర్థి ముఠాలను బెదిరించేందుకే ఈ వీడియోలను పోస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు కోయంబత్తూరు పోలీసు కమిషనర్‌ వి. బాలకృష్ణన్‌ తెలిపారు. ఈ క్రమంలోనే మరో గ్యాంగ్‌(గౌతమ్‌ బ్యాచ్‌)కు చెందిన 56 మందిని అరెస్ట్ చేసినట్టు స్పష్టం చేశారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..
 

Advertisement
 
Advertisement
Advertisement