సీఎం కనిపించగానే టీవీపై చెప్పులు విసిరిన మహిళలు! | Devotees Express Anger At Karnataka CM DK Shivakumar VIP Darshan At Hasanamba Temple, Throw Slippers At Screen Showing His Visit, Video Goes Viral | Sakshi
Sakshi News home page

సీఎం కనిపించగానే టీవీపై చెప్పులు విసిరిన మహిళలు!

Nov 9 2026 11:44 AM | Updated on Nov 9 2026 11:54 AM

CMs Temple Visit Protest by Throwing Slipper

హాసన్: కర్ణాటకలోని హాసన్‌లో గల ప్రసిద్ధ హసనాంబ ఆలయంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పర్యటన తీవ్ర వివాదానికి దారితీసింది. సీఎం ప్రత్యేక పూజల కోసం ఆలయానికి రావడంతో సాధారణ భక్తుల దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్న వేలాది మంది భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో డీకే శివకుమార్‌ తన సతీమణితో కలిసి ఆలయానికి చేరుకున్నారు. గర్భగుడిలో కొంతసేపు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సమయంలో సాధారణ దర్శనానికి వచ్చిన భక్తులను లోపలికి అనుమతించలేదు.
 

మరోవైపు క్యూలైన్ల సమీపంలో ఏర్పాటు చేసిన టీవీ స్క్రీన్‌పై సీఎం గర్భగుడిలో పూజలు చేస్తున్న దృశ్యాలను ప్రసారం చేశారు. దీంతో అప్పటికే గంటల తరబడి ఎదురుచూస్తున్న మహిళా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమ ప్రయోజనాలను కాపాడేందుకు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని, ఇబ్బందులు పెట్టడానికి కాదని ఓ మహిళ వ్యాఖ్యానించారు. మరికొందరు భక్తులు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆగ్రహంతో కొందరు మహిళలు తమ చెప్పులు తీసి టీవీ స్క్రీన్‌పైకి విసిరారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement