జీ20 శిఖరాగ్ర సదస్సుకు జిన్‌పింగ్‌ గైర్హాజరు! | Sakshi
Sakshi News home page

జీ20 శిఖరాగ్ర సదస్సుకు జిన్‌పింగ్‌ గైర్హాజరు!

Published Fri, Sep 1 2023 6:30 AM

Chinese President Xi Jinping likely to skip G20 Summit in India - Sakshi

న్యూఢిల్లీ: జీ20 దేశాల అధినేతల ముఖ్యమైన శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ హాజరవుతారా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ నెల 9, 10న ఢిల్లీలో ఈ సదస్సు జరుగనుంది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్, యూకే ప్రధానమంత్రి రిషి సునాక్‌ సహా వివిధ దేశాదినేతలు హాజరు కానున్నారు.  భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు జిన్‌పింగ్‌ హాజరయ్యే అవకాశం లేదని  మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. బదులుగా ప్రధానమంత్రి లీ కియాంగ్‌ రావొచ్చని తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ çకూడా సదస్సుకు రావడం లేదు.

Advertisement
 
Advertisement
 
Advertisement